నా రూటే సినిమా

Sun,February 17, 2019 01:05 AM

జి.గణేశ్ (చిక్కడపల్లి): నేటి యువత సాప్ట్ వేర్ ఇంజినీర్లుగా అమెరికాలో రాణిస్తుంటే హైదరాబాద్‌కు చెందిన రోహిత్ గోవర్ధనం అందుకు భిన్నంగా ఫిల్మ్ మేకింగ్‌లో సత్తా చాటుతున్నాడు. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ (కంప్యూటర్స్ సైన్స్) పూర్తి చేసిన రోహిత్ ఆసక్తి మేరకు అమెరికా లాస్ ఏంజిల్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నా డు. ఇండియాలో ఉన్నప్పుడే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో ఓట్ అనే సందేశాత్మక లఘు చిత్రాన్ని స్వీయ కథ, దర్శకత్వంలో నిర్మించి పలువురి మన్ననలు పొందాడు.
విదేశీ కళాకారులతో..
అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరాక అక్కడి నటీనటులతో కళాకారులతో మదర్, హంగర్, యూనివర్సల్ బ్రదర్ హుడ్, లెటర్ ఫ్రంట్ హేవన్, బ్లోమీ ,ఐడెంటిటీ, చీటోస్ వంటి అనేక సందేశాత్మక చిత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు.

335

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles