లక్ష్య సాధనకు విద్యార్థులు పట్టుదలతో కృషి చేయాలి

Sun,February 17, 2019 01:04 AM

అల్వాల్ : విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు తగిన కృషి, పట్టుదలే కాకుండా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని త్వరితగతిన లక్ష్యాన్ని చేరుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం లయోలా అకాడమీలో జరిగిన 40వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎన్నుకోవడంలో కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకొని అందుకు తగిన వనరులను సమకూర్చుకొని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా లక్ష్య సాధనకు ముందుకుపోవాలన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైందని, దానిని వృథా చేసుకోకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు ప్రిన్సిపాల్ రెవ ఫాదర్ పోతిరెడ్డి అంథోని వార్షిక రిపోర్టు చదివి కళాశాలలో జరిగిన అభివృద్ధి పనులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన విజయాలను వివరించారు. విద్య, ఇతర అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. విద్యార్థుల ఆట పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్(పీజీ) డా.జోజిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డి. బాలస్వామి, రెక్టర్ రాజు, కరస్పాండెంట్ తైనీస్ తదితరులు పాల్గొన్నారు.

122

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles