రాజకీయ నాయకుల సమక్షంలో..

Sun,February 17, 2019 01:04 AM

-ఈవీఎంలపై మాక్ పోలింగ్
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రిజిస్టర్‌లో సంతకంతో పాటు ఐడీ కార్డు ఉన్న వారికి మాత్రమే గోదాంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శామీర్‌పేట్‌లో ఈవీఎంలు భద్రపర్చిన వ్యవసాయ గోదాంలో వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలపై రాజకీయ నాయకుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈవీఎంలపై ఫస్ట్ లేవల్ చెకింగ్ ప్రక్రియ పూర్తి అయిందని, ఒక శాతం ఈవీఎంలను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకొని 1200 ఓట్లు గల ఈవీఎంల మిషన్లు ఒక శాతం, వెయ్యి ఓట్లు గల ఈవీఎం మిషన్లు రెండు శాతం, 500 ఓట్లు గల ఈవీఎం మిషన్లు రెండు శాతం అభ్యర్థుల వారీగా బ్యాలెట్ యూనిట్లపై మాక్ పోల్ నిర్వహించినట్లు తెలిపారు. రాత్రి ఏడు గంటలకు మాక్ పోలింగ్ ముగిసిందని, మాల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలపై కేసులు ఉన్నందున జిల్లా పరిధిలో మిగిలిన నాలుగు నియోజకవర్గాల ఈవీఎంలపై మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ నుంచి నందారెడ్డి, బీజేపీ నుంచి కాంతారావు, కాంగ్రెస్ నుంచి వెంకటేశ్‌గౌడ్ తదితర పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. మాక్‌పోల్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

115

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles