ఎల్లువచ్చి గోదారమ్మ..

Sat,February 16, 2019 12:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐటీ కారిడార్‌కు గోదావరి జలాలు తరలివచ్చాయి. నీటి లభ్యతను మరింత మెరుగుపర్చేందుకు రూ.398 కోట్లతో జలమండలి ఘనపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు వరకు 44 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి 44 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు పటాన్‌చెరులోని రిజర్వాయర్‌కు చేరుకొన్నాయి. దీంతో శనివారం ఉదయం నుంచి ఆర్సీపురం, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా మరింత మెరుగుపడుతుంది.

665

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles