విశ్వప్రగతి....

Mon,February 11, 2019 02:19 AM

-నేటితో మూడేండ్లు పూర్తిచేసుకున్నబల్దియా పాలకమండలి
-వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
-బల్దియా పాలక మండలికి నేటితో మూడేండ్లు
-వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు
-పేదల సంక్షేమమే ధ్యేయంగా పనులు
-రూ. 8 వేల కోట్లతో డబుల్ ఇండ్ల నిర్మాణం

రూ.2,399 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులు
హైదరాబాద్‌ను విశ్వనగరిగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా బల్దియా దూసుకుపోతున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది. బల్దియా పాలకమండలి సోమవారంతో మూడేండ్లు పూర్తిచేసుకున్నది. నగరాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతో సుమారు రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 8 వేల కోట్ల రూపాయలతో డబుల్ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.2399.64 కోట్లతో ైఫ్లెఓవర్లు, కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా మొక్కలను నాటారు. గ్రేటర్‌ను సమగ్రాభివృద్ధి చేస్తూ విశ్వ నగరి వైపు పరుగులు తీయిస్తున్నారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పరుగులు ఇలా..
-రూ.22 వేల కోట్ల వ్యయంతో ఎస్‌ఆర్‌డీపీ పనులు
-రూ 8 వేల 3 వందల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు
-రూ.1,523 కోట్లతో ైఫ్లెఓవర్ల నిర్మాణాలు
-రూ. 500 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ
-రూ.35 కోట్లతో నాలాల పూడిక పనులు
రూ.36కోట్లతో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనులు
-రూ.377.75 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువుల అభివృద్ధి
-సిగ్నల్ ఫ్రీ రవాణాకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ)లో చేపట్టిన మూడు అండర్‌పాస్‌లు, రెండు ైఫ్లెఓవర్లు నగర వాసులకు అందుబాటులోకి వచ్చాయి
-దేశంలోనే అదిపెద్దదిగా పేర్కొంటున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి.
-గ్రేటర్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది
-హైదరాబాద్‌లో నూతన రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాలాల పూడిక పనులను ఏడాది పొడుగునా చేపట్టే విధానం విజయవంతమైంది
-డీపీఎంఎస్ విధానంతో సిటీలో భవన నిర్మాణ అనుమతులు వేగంగా మంజూరు చేస్తున్నారు.
-స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో హైదరాబాద్ నగరం ఘన వ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానం, స్వచ్ఛతలో 22వ స్థానంలో జీహెచ్‌ఎంసీ నిలిచింది.
-హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనులకు బాండ్ల ద్వారా నిధులను సేకరించుకోవడంలో దేశంలోనే జీహెచ్‌ఎంసీ ద్వితీయ స్థానంలో నిలిచింది.
-జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను 2018 ఆగస్టు 11న ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
-రూ. 35.10 కోట్ల తో చేపట్టిన చార్మినార్ ఫెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులు తుది దశలో ఉన్నాయి.
-గ్రేటర్ హైదరాబాద్‌లో గత మూడేండ్లుగా హరితహారంలో భాగంగా రెండు కోట్ల మొక్కలకుపైగా నాటారు.
-ఎస్‌ఆర్‌డీపీ పథకానికి నిధుల సేకరణకు బాండ్ల ద్వారా రెండు విడుతలుగా రూ. 395 కోట్లను సేకరించారు.
-రూ. 20 కోట్ల వ్యయంతో 40 ప్రాంతాల్లో మోడల్ మార్కెట్లను నిర్మిస్తున్నది. ఇప్పటి వరకు 28 మార్కెట్ల నిర్మాణం పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి.
-నగరంలో ఐదు రూపాయలకే భోజనాన్ని అందించేందుకు 150 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ పథకంగా పిలుస్తున్న ఈ భోజన కేంద్రాల ద్వారా రోజుకు 40వేల మందికి భోజనాన్ని అందిస్తున్నారు.
-కాగితం అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫైళ్లను నిర్వహించే ఈ- ఆఫీస్ విధానాన్ని 2014లో ప్రారంభించారు.
-2018 జనవరి నాటికి నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు పాజెక్ట్ పూర్తయింది. ఈ పాజెక్టును రూ. 271.40 కోట్లతో చేపట్టారు. దీంతో విద్యుత్ చార్జీల రూపంలో రూ. 101.14 కోట్లు ఆదా అవుతుంది.
అభివృద్ధి పరుగులు ఇలా..
-రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఇతర శాఖల కన్నా ముందంజలో ఉంది.
-2018వ సంవత్సరంలో 14,415 భవన నిర్మాణ అనుమతులను, 1557 ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లను టౌన్‌ప్లానింగ్ విభాగం జారీచేసింది. 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు భవన నిర్మాణ అనుమతుల మంజూరి ద్వారా రూ. 765.70 కోట్లు జీహెచ్‌ఎంసీకి లభించాయి.
-వివిధ నాలాల్లోని 47 సమస్యాత్మక ప్రాంతాల్లో రూ. 230 కోట్ల వ్యయంతో నాలాల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
-మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ నిర్వహణకు మొదటి దశలో 35 జంక్షన్ల అభివృద్ధి, రెండో దశలో మరో 30 జంక్షన్ల అభివృద్ధి చేపట్టారు.
-16 మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్నది.
-నగరంలోని 24 శ్మశానవాటికలను రూ. 24.13 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో 10 పూర్తికాగా మరో 14 పురోగతిలో ఉన్నాయి.
-రూ. 3.82కోట్ల వ్యయంతో ఐదు ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.
-నగరంలోని 63 చెరువులను రూ. 94.17 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టగా వీటిలో 50 చెరువుల్లో పనులు పురోగతిలో ఉన్నాయి.
-కాలుష్య నివారణకు రూ. 27.81కోట్లతో 30 చెరువుల్లో పత్యేకంగా గణేశ్ నిమజ్జన కొలనుల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 13 పూర్తికాగా మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.
-రూ. 45.13 కోట్లతో 14 స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్‌పూల్స్, స్టేడియాలను నిర్మించారు.
-నాలుగు ప్రాంతాల్లో రూ. 13 కోట్ల వ్యయంతో ఫిప్ మార్కెట్ల నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది.
-జవహర్‌నగర్‌తో పాటు 12 గ్రామాలకు రూ. 4.61కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా
-జవహర్‌నగర్ వ్యర్థాల ట్రీట్ మెంట్ ప్లాంట్‌కు రూ. 1.86 కోట్లు
-నగరంలో పారిశుధ్య విభాగంలో ఉన్న 22వేల కార్మికులకు దేశంలో మరే నగరంలో లేనివిధంగా 14వేల రూపాయల వేతనాన్ని అందిస్తున్నారు.
-గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కలను దత్తత తీసుకొనే వినూత్న కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 1,617 వీధికుక్కలను దత్తత ఇచ్చారు.
-22 లక్షల ఇండ్లకు ఇంటికి రెండు డస్ట్‌బిన్ డబ్బాల చొప్పున 44 లక్షల డస్ట్‌బిన్లను అందజేశారు.
-నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడానికి 2 వేల ఆటో టిప్పర్లను అందించే పథకాన్ని రాష్ట్ర పభుత్వం ప్రారంభించింది.
-2,152 మంది స్వచ్ఛ వాలంటీర్లను నియమించి వారి ద్వారా 11,06,426 నివాసితులకు స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.
-22 వేల మంది పారిశుధ్య కార్మికుల హాజరును ఆధార్ నంబర్లతో అనుసంధానించిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని జీహెచ్‌ఎంసీలో ప్రారంభించారు.
-47,756 స్వయం సహాయక బృందాలు పనిచేస్తుండగా 2018-19లో 549 కొత్త గ్రూపులు ఏర్పాటయ్యాయి ఈ బృందాలకు రూ. 1211.64 కోట్లను అందజేశారు.
-నగరంలో నిరాశ్రయుల సౌకర్యార్థం 15 నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:
జీహెచ్‌ఎంసీ పాలకమండలి సోమవారంతో మూడేండ్లు పూర్తిచేసుకొని నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతున్నది. విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో వేల కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థలో ముందడుగు, లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులు, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛ హైదరాబాద్‌కు గుర్తింపుగా పలు పురస్కారాలు, చెరువుల సుందరీకరణ తదితర విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఏవిధమైన అవినీతి ఆరోపణలు లేని, రాని పాలక మండలిగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలోని జీహెచ్‌ఎంసీ పాలక మండలి మూడేండ్లు పూర్తిచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్ దార్శనికత, యువనాయకులు, మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి దాదాపు రూ. 50వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులు
దాదాపు 339 ఎకరాల్లో 12 మిలియన్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలతో 4,44,025 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జవహర్‌నగర్ డంప్‌యార్డు క్యాపింగ్ పనులు 90 శాతం పూర్తయ్యాయి రూ.350 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం ఆరు దశల్లో చేపట్టే ఈ పనులు దేశంలోనే అతిపెద్ద డంప్‌యార్డు క్యాపింగ్ పనులుగా నిలిచాయి.
ఎస్‌ఆర్‌డీపీ ఫలాలు..
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్,ఎల్బీనగర్ చింతలకుంట అండర్‌పాస్‌లు, కామినేని జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్ ైఫ్లెఓవర్లను ప్రారంభించారు. రాజీవ్‌గాంధీ ైఫ్లెఓవర్, ఎల్బీనగర్ ఎడమవైపు ైఫ్లెఓవర్లను త్వరలోనే ప్రారంభించనున్నారు.
రూ.2399 కోట్ల నిధులతో..
నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకం కింద రూ.2399.64కోట్లతో పలు ైఫ్లెఓవర్లు ,కారిడార్లు, రోడ్‌అండర్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రూ.436 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ైఫ్లెఓవర్ల నిర్మాణం. రూ.184 కోట్ల తో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, రూ.150 కోట్లతో రోడ్ నంబర్ 45 జూబ్లీహిల్స్ స్టేషన్ నుంచి దుర్గం చెరువు వరకు ఎలివేటెడ్ కారిడార్ రూ.333.55 కోట్లతో సెవెన్ టూంబ్స్, ఫిలింనగర్ రోడ్, ఓయూ కాలనీ మీదుగా విస్పర్‌వ్యాలీ జంక్షన్ వరకు ైఫ్లె ఓవర్ నిర్మాణం, రూ.263.09 కోట్ల తో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మీదుగా కొండాపూర్ జంక్షన్ వరకు ైఫ్లెఓవర్ నిర్మాణం, రూ.279 కోట్లతో బయోడైవర్సిటీ, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ జంక్షన్‌లో ైఫ్లెఓవర్ల నిర్మాణం తదితర పనులు పురోగతిలో ఉన్నాయి.

1113

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles