ఖాన్ లతీఫ్ ఎస్టేట్ భారీ అగ్ని ప్రమాదం

Thu,January 24, 2019 12:53 AM

-లక్షల్లో ఆస్తి నష్టం?
-వెంటనే స్పందించిన ఎస్టేట్ సిబ్బంది
-భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు
-14 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
-సందర్శించిన వివిధ శాఖల అధికారులు
-స్పృహ తప్పి పడిపోయిన డీఆర్ సిబ్బంది
బేగంబజార్, నమస్తే తెలంగాణ : బహుళ అంతస్తుల భవనం ఖాన్ లతీఫ్ ఎస్టేట్ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోగా, రూ.లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, మంటలను ఆర్పే ప్రయత్నంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పే అత్యాధునిక వాహనాలతోపాటు 14అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది రెండున్నర గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకు వచ్చారు. అగ్నిమాపక శాఖతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖాన్ లతీఫ్ ఎస్టేట్ ఐదవ అంతస్తులో కొనసాగుతున్న అడ్వాంటేజ్ ఐటీ సొల్యూషన్ సంస్థలో ఏసీలో సంభవించిన షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

దట్టమైన పొగతో మంటలు వ్యాపించి భవనంలోని ఇతర అంతస్తులకు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎస్టేట్ మెయింటెనెన్స్ ఉద్యోగులు హుటాహుటిన భవనంలోని అన్ని ఫ్లోర్లలో కొనసాగుతున్న కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కిందికి తరలించి గ్రౌండ్ ఫ్లోర్ కొనసాగుతున్న దుకాణాలను మూయించి వేశారు. పోలీసులు, అగ్ని మాపక శాఖకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెండు స్కైైఫ్లె అత్యాధునిక అగ్నిమాపక వాహనాలతోపాటు 12అగ్ని మాపక వాహనాలతో జలమండలి ద్వారా వాటర్ ట్యాంకర్ రప్పించి అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలోని 4, 5, 6వ అంతస్తులో మంటలు అంటుకుని అందులోని సామగ్రి కాలిబూడిదైంది. ఇదిలా ఉండగా జీహెచ్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం సిబ్బంది మంటలను అదుపు చేసే క్రమంలో 5వ అంతస్తులోకి ప్రవేశించిన ఖాజామోహియుద్దీన్ స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం దవాఖానకు తరలించారు.

స్పందించిన అధికారులు.. తప్పిన పెనుప్రమాదం
ప్రమాదం విషయంలో అధికారులు సకాలంలో స్పందిం చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పాటుపడ్డా రు. ఎస్టేట్ ఉద్యోగులు భవనంలోని పలు అంతస్తుల్లో పని చేసే వారిని కిందకు తరలించడంతో ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఎస్టేట్ నిర్మాణం 1992లో ప్రారంభంకాగా, 1997లో పూర్తయింది. బహుళ అంతస్తుల భవనంలో పలు కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు కొనసాగుతున్నాయి. ఐదవ అంతస్తులో ఏసీ నుంచి పొగలు వస్తున్నాయన్న నేపథ్యంలో అక్కడికి చేరుకునే లోపే మంటలు తీవ్రస్థాయిలో వ్యాపించి ఇతర ఫ్లోర్లకు చేరుకున్నాయని ప్రత్యక్ష సాక్షి ఆంజనేయులు తెలిపారు.

బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు
భారీ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పలు అంతస్తుల్లో పనిచేసే ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పలు ప్రాంతాల వారు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఇరు ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ దారి మళ్లించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు
ప్రమాదం సమాచారాన్ని అందుకున్న అదనపు పోలీస్ కమిషనర్(లాఅండ్ డీఎస్ చౌహాన్, సెంట్రల్ జోన్ డీసీపీ పి.విశ్వప్రసాద్, జీహెచ్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అగ్ని మాపకశాఖ డీజీ గోపికృష్ణ, అదనపు డీజీ లక్ష్మీప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాస్ శ్రీధర్ అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ మాజీ ఎంపీ మందడి అంజన్ యాదవ్, గన్ కార్పొరేటర్ మమతా సంతోష్ జీహెచ్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ విశ్వజిత్, సర్కిల్-14 డీసీ రీచాగుప్తా, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కెఎన్ మెహ్రా సంఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

454

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles