అష్టలక్ష్మీదేవాలంలో లక్ష్మీవైభవంపై ప్రవచనాలు


Wed,January 23, 2019 12:44 AM

ఆర్కేపురం:లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవ చకులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం రాత్రి ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని అష్టలక్ష్మీదేవాలయం కల్యాణమడపంలో లక్ష్మీవైభవంపై ఆయన ప్రవచనం చేశారు. ప్రవచనంలో భాగంగా లక్ష్మీదేవి కటాక్షం వున్నవారికి ఏ లోటూ వుండదని, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయని తెలిపారు. లక్ష్మీదేవి వల్ల అన్ని ఆపదలు తొలగిపోతాయని అమ్మవారిని బిల్వ పత్రా లతో, కలువ పుష్షాలతో, తులసి దళాలతో అర్చన చేయటాన్ని వివిధ సందర్భాల్లో చూడవచ్చిన చెప్పారు. లక్ష్మీదేవిని అలంకారం చేయటంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఆమె వైభవాన్ని సకల దేవతల రూపంలో కనులారా తిలకించి భక్తులు అను గ్రహిం చాలన్నారు. ధర్మాన్ని పాటించే వారి వద్దే లక్ష్మీదేవి వెన్నంటి వుంటుందన్నారు. స్వార్థ చింతనకు దూరంగా ఉండి భక్తితత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. దేవుని పట్ల మనసు పెట్టి ప్రార్థించాలని సూచించారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అష్టలక్ష్మీ అమ్మవారి కటాక్షం గురించి వివరించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్పొరేటర్ రాధాధీరజ్ దేవాలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ కమిటీ సభ్యులు మురుగేశన్, నాగమళ్ళ శ్రావణ్ సుధాకర్ యాద అశోక్ గుప్త, శ్రీను, జగన్, వనం యాదయ్య, నర్సింగ్ పాల్గొన్నారు.

409

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles