కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని ఎత్తివేయాలి

Wed,January 23, 2019 12:41 AM

చిక్కడపల్లి : ప్రజలకు వినోదాన్నిచ్చే కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని ఎత్తివేయాలని తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్ అన్నారు. తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కేబుల్ ఆపరేటర్ల సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేబుల్ వ్యవస్థకు జీఎస్టీ ఎత్తివేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ప్రజలకు రెండు నుంచి 450 చానళ్లు అందిస్తున్నామని తెలిపారు. బ్రాడ్ కాస్టింగ్ వారే మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసేలాగా మనం తయారు కావాలని, అందుకోసం మనందరం ఐక్యంగా ఉండాలన్నారు. మనదేశంలో 17కోట్ల టీవీ కనెక్షన్ ఉన్నాయని, వాటిలో పది కోట్ల కేబుల్ కనెక్షన్లు ఉండగా, ఏడు కోట్ల డీటీహెచ్ ఉన్నాయన్నారు. ప్రస్తుతం రూ.250 నుంచి రూ.350 వరకు వినియోగదారుల నుంచి కేబుల్ ఆపరేటర్లు వసూలు చేస్తున్నారని, కానీ ట్రాయ్ నిబంధనల ప్రకారం కస్టమర్లకు వెయ్యి రూపాయిల వరకు భారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేబుల్ ఆపరేటర్లు ముఖ్యపాత్ర పోషించారని, రాష్ట్రంలో ట్యాక్స్ రద్దు చేయాలన్నారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బద్రీనాథ్ యాదవ్, ఉపాధ్యక్షుడు ముక్తార్ అహ్మద్, భవానీశంకర్, పల్లె రాము, కోశాధికారి రాజ్ మధుకర్, సచిన్, కృష్ణమూర్తి యాదవ్, బంగారు ప్రకాశ్, జమీల్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

304

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles