చెట్ల పొదల్లో దాక్కొని... అర్ధరాత్రి చోరీలు


Tue,January 22, 2019 12:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గుజరాత్ రాష్ట్రంలో చడ్డీ గ్యాంగ్ సభ్యులు మూడు వేల మంది వరకు ఉంటారని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు తేల్చారు. గత మూడు ఏండ్లలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు చోరీలకు పాల్పడ్డ ఘటనల దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 5, 6 తేదీల్లో కేపీహెచ్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు జరిగాయి. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్ బృందం సీసీ కెమెరాలను పరిశీలించి, పలు ఆధారాలు సేకరించారు. రెండు వారాల పాటు గుజరాత్ దాహోద్ జిల్లాలో మకాం వేసి ఈ చోరీలకు పాల్పడ్డ ఐదుగురు సభ్యుల ముఠాలోని ఇద్దరు హాసన్ నర్సింగ్, రాజుసావ్ బారీలను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. మరో ముగ్గురు వినోద్, పంకజ్, జేసమ్ పరారీలో ఉన్నారు. ఈ ఇద్దరు పట్టుబడడంతో 2017 నుంచి 2019 జనవరిలో జరిగిన మొత్తం 5 ఇండ్లలోని చోరీ కేసుల చిక్కుముడి వీడిపోయింది. అయితే విచారణలో గుజరాత్ రాష్ట్రం, దాహోద్ జిల్లాలోని 30 గ్రామాల్లో ఈ చెడ్డీగ్యాంగ్ పేరొందిన ముఠా సభ్యుల సంఖ్య దాదాపు 3వేల వరకు ఉంటుందని, ఇందులో ఒక్కొక్కరు ఒక గ్రూపు కింద విడిపోయి దేశవ్యాప్తంగా చోరీలకు తెగబడుతారని విచారణలో తేలింది. గత ఏడాది రాచకొండ పోలీసులు వరుస చోరీలకు పాల్పడ్డ దాహోద్ చెందిన ఓ గ్రూపు చడ్డీగ్యాంగ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


చెట్ల పొదల్లే వారికి రక్ష...
చడ్డీ గ్యాంగ్ సభ్యులు హైదరాబాద్ ప్రధానంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు టార్గెట్ చేస్తారు. సంక్రాంతితో పాటు వేసవి సెలవుల కారణంగా ఇక్కడి ప్రజలు గ్రామాలకు వెళ్తారని వారి నమ్మకం. దీంతో వీరు ఈ నెలల్లో రైలుమార్గంలో హైదరాబాద్ శివారు రైల్వే స్టేషన్ వద్ద దిగి అక్కడే ఉంటారు. ఉదయం సమయాల్లో కొద్దిగా నిర్వానుష్యంగా ఉండే ప్రాంతాల్లోని తాళం ఉన్న ఇం డ్లు, అపార్ట్ రెక్కీ చేస్తారు. టార్గెట్ ఇంటికి సమీపంలో చెట్ల పొదలను ఎంచుకుని సాయంత్రానికి అక్కడికి చేరుకుని ఆ పొదల్లో దాక్కుంటా రు. అర్ధరాత్రి సమయంలో వేషధారణలో భాగంగా చడ్డీ, బనియన్ మీదనే ఉంటారు. నడుముకు లుంగీని చుట్టుకుని చెప్పులను వాటిలో పెట్టుకుంటారు. నెత్తికి తలపాగ చుట్టుకుని ఉంటారు. అలా భయనకంగా కనిపిస్తూ చోరీలకు తెగబడతారు. ఆ తర్వాత ఎక్కడికి పారిపోకుండా ఉదయం 5 గంటల వరకు తిరిగి అదే చెట్ల పొదల్లో దాక్కుంటారు. తెల్లవారగానే మెల్లిగా ఒక్కొక్కరు నడుచుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. తిరిగి మరో ప్రాంతంలో రెక్కీ చేస్తారు. అలా వరుస చోరీలకు పాల్పడి భారీగా బంగారం, నగదు కాజేసి... తిరిగి వారి సొంత గ్రామాలకు వెళ్లిపోతారని పట్టుబడ్డ నిందితులను విచారించనప్పుడు పోలీసుల ఈ విషయం తెలిసింది. ఇక అక్కడికి వెళ్లి పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దాడులకు కూడా వెనకాడారు. వీరి స్థావరాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం లేకుండా కిలోమీటర్ దూరం ప్రయాణించాలి. స్థానిక పోలీసుల నుంచి కూడా ఆశించి న సహకారం ఉండదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఎస్ పోలీసులు ఇన్ నుంచి సమాచారం సేకరించి... వారిని సొంత ప్రాంతంలో కాకుండా జెసావాడా థానా పరిధిలో అరెస్ట్ చేశారు.

395

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles