టీడీపీపై నమ్మకం పోయింది

Thu,January 17, 2019 01:30 AM

-ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్
ఖైరతాబాద్: టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది....మతోన్మాద బీజేపీని ప్రజలు నమ్మరు..అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మత ప్రభోదకుడు కేఏ పాల్ అన్నారు. బుధవారం సాయంత్రం సోమాజిగూడలోని హోటల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదేండ్ల బాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. గతంలో బాబు తనను అనేక సార్లు ప్రలోభాలకు గురి చేశారని, మరో సారి గురి చేయాలని చూస్తున్నారని, తాను కులమతాలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడుతానని తేల్చి చెప్పానన్నారు. దీంతో తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేందుకు కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణలో ఒక్క సీటు గెలిచిన బీజేపీకి ఏపీలో అదే గతి పడుతుందని, మతోన్మాద పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలైలో సైతం బీజేపీ శక్తులే గొడవలు సృష్టిస్తున్నాయన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని అయ్యే పరిస్థితులు లేవని, ప్రజలకు ఆ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వంద సీట్లు గెలిచే సత్తా తమకు ఉందన్నారు.

406

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles