మన సంస్కృతే ఒక పండుగ

Sun,January 13, 2019 12:33 AM

-ప్రతీ ప్రత్యేక దినమూ సంబురంలా
-సాహితీ ఉద్ధండుల స్మరణమూ ఓ ఘట్టంలా
-కళల పునరుద్ధరణకు
-సాహితీ వికాసానికి
-ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న భాషా సాంస్కృతిక శాఖ
భాషా, సంస్కృతులకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంలో ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రత్యేక కార్యాచరణతో ‘బ్రాండ్ తెలంగాణ’ ముద్రతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. 2018లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైవిధ్య భరిత కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పాయి. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు, పండుగలు, తెలంగాణ వైతాళికుల జయంతి, వర్ధంతి, కళాకారులకు శిక్షణా తరగతులు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, డాక్యుమెంటేషన్ తెలంగాణ కళాసంస్కృతిని భద్రపరచడం తదితర కార్యక్రమాలు సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. కళాకారులను ఆదుకోవడానికి 2401 మంది కళాకారులకు రూ.1500 పింఛన్, దివంగత కాంతారావు సతీమణి హైమావతి, సినిమా ఆర్టిస్ట్ పావలా శ్యామల, ఒగ్గు కథ కళాకారులు దివంగత చుక్కా సత్తయ్య (2017వరకు)లకు నెలకు 10 వేల ప్రత్యేక పింఛన్లు అందించి ఆర్థికంగా చేయూతనిచ్చింది. ఏటా తెలంగాణ సారస్వత పరిషత్, పోతన విజ్ఞాన పీఠం,సాహిత్య అకాడమీలకు గ్రాంట్ పాటు 550 మంది కళాకారులకు రూ. 17.13 కోట్లతో బడ్జెట్ కేటాయించారు.

ప్రత్యేక కార్యక్రమాలు
మ్యూజికథాన్ : (ఫిబ్రవరి 4) 12 గంటల నాన్ స్టాప్ సంగీత, పాటల విభావరి.
సిద్దిపేట కళా ఉత్సవం :(మార్చి 1-3) సిద్దిపేటలో కోమటిచెరువు కళాక్షేత్రం (ఓపెన్ థియేటర్)లో కళోత్సవం.
జాతీయ గజల్ ఫెస్టివల్ : (డిసెంబర్ 12-13) తరన్నుమ్ శీర్షికన జాతీయ గజల్ ఫెస్టివల్
అసోం కల్చరల్ కార్యక్రమాలు : (ఏప్రిల్ 4) : హైదరాబాద్ ఫోనిక్స్ ఎరీనాలో రంగోలి బిహు ఫెస్టివల్.
దివ్య త్రయం : ( ఏప్రిల్ 15) : శాస్త్రీయ నృత్య రూపకం ప్రదర్శన
తెలంగాణ కళారాధన : (ఏప్రిల్ 15-జూన్ 5): రవీంద్ర భారతి ప్రాంగణంలో సలాం-ఏ-తెలంగాణ, అరుదైన కళారూపాల ప్రదర్శన, మ్యూజిక్, మిమిక్రీ, మైమ్ ఫెస్టివల్, దివ్యాంగులతో దృష్టిపథం, రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు.
జానపద జాతర : (ఆగస్టు 22): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వివిధ తేదీల్లో వేలాది మంది కళాకారులతో జానపద జాతర నిర్వహించారు.
మంగళ వాద్య మహోత్సవం : (అక్టోబర్ 26) రాష్ట్రంలోని మంగళవాద్య కళాకారులతో నిరంతర కచేరీ.
దక్కనీ కళల ప్రదర్శన: 30 రోజుల పాటు గజల్, ముషాయిరా, ఖవ్వాలీ, మజాహియా ముషాయిరా , విఠల్ రావు గజల్ ఫెస్టివల్ సహకారం.
సినీ వారం : ( రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ...ప్రతి శనివారం ) తెలంగాణలోని యువ చిత్ర దర్శకులకు ఉపయోగపడేలా లఘు చిత్రాలు, ఫీచర్ ఫిలింల ప్రివ్యూలు.
సండే సినిమా :( ఏ విండో టు వరల్డ్ సినిమా) సినీ అభిమానులకు ప్రపంచ సినిమా పరిచయం చేసేందుకు విదేశీ సినిమాల ప్రదర్శన.
అవతరణ ఫిల్మోత్సవ్ : రాష్ట్ర అవతరణ సందర్భంగా లఘు చిత్రాల ప్రదర్శనలు.
బతుకమ్మ ఫిల్మోత్సవం: (అక్టోబర్ 9-16): బతుకమ్మ సందర్భంగా సినిమాలు, బతుకమ్మ పాటల ప్రదర్శన.
ఫెంటాస్టిక్ ఫైవ్ : ఇరాన్, జర్మనీ, వివిధ భాషల్లో దేవదాస్, ఫ్రాన్స్, కొరియన్, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్.
సాంస్కృతిక శిక్షణా తరగతులు
‘కలరి’వర్క్ (మే 17-16, మే17-26) రంగస్థల కళాకారులు, నృత్యకళాకారుల కోసం రవీంద్రభారతిలోని ‘రంగస్థలం వేదిక’లో కలరిపట్టు మార్షల్ ఆర్ట్స్ వర్క్
ఒగ్గుడోలు : తెలంగాణాలోని 50 మంది ఒగ్గు కళాకారులకు (మార్చి 5-7) తేదీల్లో, 13 జిల్లాలకు చెందిన 135 మంది ఒగ్గుకళాకారులకు (సెప్టెంబర్ 5-25) తేదీల్లో నైపుణ్య శిక్షణ.
డాక్యుమెంటేషన్ : అరుదైన,విశిష్టమైన తెలంగాణ కళారూపాలు, పండుగలను డాక్యుమెంట్ రూపంలో రికార్డు చేయడం.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ : తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ గ్రౌండ్స్)ను హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం ఉచితంగా అందించి సహకరించడం.
నాటికలు..
మంత్రి శ్రీనివాసరావు నాటకోత్సవం (ఏప్రిల్ 25-29), పరుచూరి రఘుబాబు స్మారక 28వ జాతీయ నాటకోత్సవం(మే 1-4), సురభి నాటకోత్సవాలకు సౌజన్యం, తెలంగాణ యువ నాటకోత్సవాలు (మే 25-27, డిసెంబర్ 27-30), ఖదీర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్, హిందీ నాటకోత్సవానికి సౌజన్యం, వరంగల్ జరిగిన పందిళ్ల శేఖర్ నాటకోత్సవానికి సహకారం. వివిధ జిల్లాల్లో నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ పౌరాణిక నాటకోత్సవాలకు సహకారం అందించారు.
ఛాయా చిత్రాల ప్రదర్శన
రవీంద్రభారతిలోని ఐ.సి.సి.ఆర్. ఆర్ట్ గ్యాలరీలో చిత్ర కళాప్రదర్శన : 2018 లో వివిధ చిత్రకళాకారుల ఛాయాచిత్రాల,చిత్రకళా ప్రదర్శన. ‘తెలంగాణ మహిళా పురాతన సమకాలీన సంస్కృతి అధ్యయనం పై ఛాయా చిత్రప్రదర్శన, కార్టూన్ చిత్ర ప్రదర్శన ,లైఫ్ ఎట్ తెలంగాణ , బోనాల దృశ్యం, తెలంగాణ చిత్రకళాప్రదర్శన, క్లౌడ్9 మేఘాల చిత్రకళా ప్రదర్శన.

అంతర్జాతీయ ఉత్సవాలు
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ - స్వీట్ ఫెస్టివల్ (జనవరి13-15): పరేడ్ గ్రౌండ్స్ అంతర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇందులో భాగంగా వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి సుమారు 1000 కి పైగా మిఠాయిల రుచి చూపించారు.
ఇంటర్నేషనల్ రామాయణ ఫెస్టివల్ : (జనవరి 21-23): భద్రాచలం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం : (మార్చి-8) : ప్రతిభావంతులైన 20 మంది మహిళలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలతో విశిష్ట మహిళా పురస్కారాలు.
ప్రపంచ కవితా దినోత్సవం :(మార్చి 21) : ‘నా బాల్యం’ శీర్షికన రవీంద్రభారతిలో బహుభాషా కవి సమ్మేళనం.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం : (ఏప్రిల్ 29): టేలర్ గార్డన్ బల్లెరినా ఆధ్వర్యంలో‘న్యూయార్క్ సిటీ ఇన్ తెలంగాణ’ డాన్స్ బ్యాలే.
పండుగలు
సంక్రాంతి సంబురాలు :(జనవరి 13-15): రవీంద్రభారతిలో గంగిరెద్దులు, హరిదాసులు, రంగోలీ ప్రదర్శనలు
మహాశివరాత్రి : రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాల్లో సాంస్కృతిక ప్రదర్శన.
ఉగాది సంబురాలు : జనహిత, ప్రగతి భవన్ ప్రత్యేక కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శన.
బోనాలు : (జూలై-ఆగస్టు): హైదరాబాద్, సికింద్రాబాద్ 160 ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు.
వినాయక నవరాత్రులు :(సెప్టెంబర్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మండపాల వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు.
బతుకమ్మ : 12 ఏండ్ల లోపు బాలికలకు బొడ్డెమ్మ పండుగ, వెయ్యిమంది అంధ మహిళలు, బధిరులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమం. 50 మంది పారా మోటరింగ్ ద్వారా ఆకాశంలో బతుకమ్మ. 12 దేశాల నుంచి పూలు తెప్పించి బతుకమ్మల అలంకరణ. వివిధ దేశాల్లో ఆయా దేశాల రాయబార కార్యాలయాల సహకారంతో విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు.
ప్రముఖుల జయంతి,వర్ధతి
భక్త రామదాసు జయంతి : ఆసియా దేశాల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ రామాయణ ఫెస్టివల్.
ఈశ్వరీబాయి వర్ధంతి (ఫిబ్రవరి 2), డా.రాంమనోహర్ లోహియా జయంతి (ఏప్రిల్ 4) ,మహాత్మ బసవేశ్వర జయంతి(ఏప్రిల్ 18), సామల సదాశివ జయంతి (మే 11),భాగ్యరెడ్డి వర్మ జయంతి(మే 22), సురవరం ప్రతాపరెడ్డి జయంతి(మే 28), పైడిమర్రి వేంకట సుబ్బారావు జయంతి (మే 28), డా.నటరాజ రామకృష్ణ వర్ధంతి(జూన్7), డా.రావిచెట్టు రంగారావు జయంతి ( జూన్ 10), ప్రొ.జయశంకర్ జయంతి (ఆగస్టు 6), చాకలి ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26), పైడి జయరాజ్ జయంతి (సెప్టెంబర్ 26), కుమ్రం భీం జయంతి (అక్టోబర్ 22), వట్టికోట ఆళ్వార్ స్వామి జయంతి(నవంబర్ 1), టి.ఎల్.కాంతారావు జయంతి (నవంబర్ 16) ,డా.ఎం ప్రభాకర్ రెడ్డి వర్ధంతి(నవంబర్ 26).
జాతీయ, రాష్ట్ర దినోత్సవాలు
గణతంత్ర దినోత్సవం : (జనవరి 26) రాజ్ వేణుగాన కచేరీ నిర్వహించారు.
తెలంగాణ అవతరణ వేడుకలు : (జూన్ 2) : రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. 48 మంది ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి రూ. 1,00,116 అందజేశారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు 11 మంది చొప్పున ఒక్కొక్కరికి రూ. 51,116 బహూకరణ
స్వాతంత్య్ర దినోత్సవం : గోల్కొండ కోటలో వెయ్యి మంది కళాకారులతో కళాప్రదర్శన.
ఇండియన్ డే : (నవంబర్ 23-24): ఐఏఎస్ శిక్షణలో ఉన్న అధికారులు తెలంగాణ కళారూపాలు ప్రదర్శించారు.

897

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles