మంచి నిర్ణయం..


Fri,January 11, 2019 12:36 AM

- 15 తీర్మానాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
- జీహెచ్‌ఎంసీ బడ్జెట్ రూ.11,538 కోట్లు


సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ 2019-20 ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. 2018 డిసెంబర్ 20వ తేదీన రూ.11,538 కోట్లతో బడ్జెట్ రూపొందించి ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపారు. దీన్ని జనరల్ బాడీ సమావేశంలో చర్చించి తుది బడ్జెట్ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం ఫిబ్రవరి 20వ తేదీలోపు పంపించాలని కమిషనర్ దానకిశోర్ తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 15 తీర్మానాలను ఆమోదించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిషనర్‌తో పాటు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జీహెచ్‌ఎంసీ 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముసాయిదాను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. డిసెంబర్ 20, 2018న రూ.11,538 కోట్లతో బడ్జెట్ రూపొందించి ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీలో ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌పై గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించి సభ్యులు ఆమోదించారు. దీనిని జనరల్ బాడీ సమావేశంలో చర్చించి తుది బడ్జెట్ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం ఫిబ్రవరి 20వ తేదీలోపు పంపించాల్సి ఉంటుందని కమిషనర్ దానకిశోర్ స్టాండింగ్ కమిటీకీ తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిషనర్‌తోపాటు, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నతాధికారులు హాజరై నిర్ణయం తీసుకున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 15 తీర్మానాలు కూడా ఆమోదించారు. సమావేశంలో సభ్యులు గొల్లూరి అంజయ్య, ముద్దగోని లక్ష్మీప్రసన్న, స్వర్ణలత సింగిరెడ్డి, మహ్మద్ ముర్తుజ అలీ, నస్రీన సుల్తాన, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ ముబిన్, ఏ.కృష్ణ, మహ్మద్ మజీద్ హుస్సేన్, వి.శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ రషీద్, ఎన్. శేషుకుమారి, తూము శ్రవణ్‌కుమార్, ఎన్. జగదీశ్వర్‌గౌడ్, ఏ. సరస్వతి హాజరయ్యారు. వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన, ఇతర అధికారులు అద్వైత్‌కుమార్‌సింగ్, కెనడీ, రవిఖిరణ్, దేవేందర్‌రెడ్డి, రఘుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, జియాఉద్దీన్, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో 15 తీర్మానాలు చేశారు. అనంద్‌బాగ్ నుంచి జెడ్‌టీసీ మార్గంలో ఆనంద్‌బాగ్ రైల్వేస్టేషన్ క్రాసింగ్ రోడ్డును 30 కిలోమీటర్ల మేరకు విస్తరించేందుకు కోల్పుతున్న ఆస్తుల సేకరణకు ఆమోదం, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ మార్గంలో నిర్మిస్తున్న మల్టీలెవెల్ ైఫ్లెఓవర్ నిర్మాణంలో ఏడు ఆస్తులకు సంబంధించిన భూములకు చదరపు గజానికి రూ.30 వేల చొప్పున రూ.5.14 కోట్లు చెల్లించేందుకు ఆమోదం. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 120 ఫీట్ల రోడ్డు విస్తరణకు 965 చదరపు అడుగుల భూమిని సేకరించినందుకుగాను భూ యజమాని ఎం. ప్రేమలతకు 50 శాతం, టీడీఆర్ మరో 50 శాతం పరిహారంగా రూ.6.27 కోట్లు చెల్లించే తీర్మానానికి ఆమోదం. టోలీచౌకి నుంచి దర్గా రోడ్డు వరకు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 150 ఫీట్ల రోడ్ల విస్తరణ పనులకు పరిహారం, రిటైర్డ్ వాల్యువేషన్ అధికారి మురళీధర్ సేవలను జూన్ 2019 వరకు పొడిగిస్తూ తీర్మానం చేశారు. ముఖ్యంగా ఆస్తుల సేకరణలో నష్టపరిహారం వంటి 15 అంశాల్లో తీర్మానాలు చేశారు.

- 2019-20 బడ్జెట్ ముసాయిదా వివరాలు ఇలా
- 2018-19 ఆమోదిత బడ్జెట్ రూ.6076.86 కోట్లు
- 2018-19 సవరించిన బడ్జెట్ రూ.5375 కోట్లు
- 2019-20 ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ.6150 కోట్లు
- మేజర్ ప్రాజెక్టుకు ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ.5388 కోట్లు
- 2019-20 ప్రతిపాదిత బడ్జెట్ మొత్తం రూ.11,538 కోట్లు

603

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles