వృద్ధాప్యంలో సమస్యలు అధిగమించాలి

Sun,December 16, 2018 12:20 AM

-రాష్ట్ర ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్లు భేష్ : డాక్టర్ గంగాధరన్
మాదాపూర్ : ముసలి తనంలో విరమణ అనేది మెదడుకే కానీ శరీరంలో వచ్చే మార్పులకు కాదని హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గంగాధరన్ పేర్కొన్నారు. శనివారం కేడబ్ల్యూ కాన్ఫరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఉన్ముక్ ఫెస్టివల్ కార్యక్రమానికి హెల్ప్ ఏజ్ ఇండియా గేవ్ చైర్మన్ మాథ్యు చెరియన్, నిర్వాహకులు మొనిమిత సర్కార్‌లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోపడుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ల పథకం చాలా బాగుందని, కేంద్ర ప్రభుత్వం కూడా వృద్ధుల కొరకు ఇటువంటి పథకాలను అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందన్నారు. 25 ఏండ్ల క్రితం హెరిటేజ్ హర్పిటాల్‌ను ప్రారంభించడం జరిగిందని దానిని గారియాట్రిక్ దవాఖాన అని పిలుస్తారన్నారు. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన అటువంటి దవాఖాన దేశంలో కేవలం 8 మాత్రమే ఉన్నాయని, అటువంటి వాటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 60స్టాల్స్ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సీనియర్ సిటిజన్స్, అనాథ ఆశ్రమం విద్యార్థులు పాల్గొన్నారు.

282
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles