ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు : తలసాని

Sun,December 16, 2018 12:19 AM

జియాగూడ : జియాగూడలోని చారిత్రాత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో ఈనెల 18వ తేదీన జరిగే వైకుంఠ(ముక్కోటి)ఏకాదశి మహోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం జియాగూడలోని రంగనాథాస్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో వైకుంఠ మహోత్సవాల ఉత్సవ బ్రోచర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రంగనాథస్వామి మహోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కన్నుల పండువగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున గొప్ప అనుభూతి కలిగిస్తుందన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడానికి యంత్రాంగం సమాయత్తవుతుందన్నారు. ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, పీడబ్ల్యూడీ, శానిటేషన్, వాటర్‌వర్క్స్, విద్యుత్, పోలీసు, ట్రాఫిక్ తదితర విభాగాలు ఉత్సవానికి వారం రోజుల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారన్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా శానిటేషన్, రోడ్ల మర్మత్తులు, విద్యుత్ దీపాలంకరణ, పార్కింగ్ మొబైల్ యూరినల్స్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

ఆర్‌అండ్‌బీ ద్వారా విద్యుత్, బారీకేడ్స్, ప్రధాన రహదారుల్లో ఐమాస్ట్ లైట్ల, స్ట్రీట్‌లైట్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. రహదారి మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు చూచించారు. జియాగూడ కార్పొరేటర్ మిత్రకృష్ణ మాట్లాడుతూ... తిరుపతిలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి మహోత్సవాల తరహాలో జియాగూడలో వైభవంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, టీఆర్‌ఎస్ కార్వాన్ నియోజకవర్గం ఇన్‌చార్జి ఠాకుర్ జీవన్‌సింగ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావూరి వెంకటేశ్, హాడ్‌అక్ కమిటీ సభ్యులు శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు డివిఎస్ రాజు, మంతటి నర్సింహ, నరహరిచారి, శేఖర్‌రెడ్డి, ఆలయ అర్చకులు రాజగోపాలాచార్యులు, శేషాచార్యులు, ప్రతినిధులు బోట్టు రామేశ్వర్, కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ శంకర్, ఏరియా సభ ప్రతినిధులు అత్తపూర్ రాజేశ్, మనోజ్ ఆరెకటిక, శ్రీనివాస్ చారి, మహిళ నాయకురాలు నర్మద, రాజశ్రీ, కల్పన, సంగీత తదితరులు పాల్గొన్నారు.

698

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles