ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్యం

Sun,December 16, 2018 12:18 AM

-గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్
బేగంబజార్ : రాష్ట్రంలో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ విజయం సాధించి, సీఎం కేసీఆర్ రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టడం, కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ గాంధీ దవాఖానలో రోగులకు అత్యాధునిక పరికరాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా దవాఖానలోని సర్జికల్ విభాగంలో ఆపరేషన్ థియేటర్ (సర్జికల్ ఓటీ)పని చేయకపోవడంతో రోగులకు ఇబ్బం దులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలో మెరుగైన వైద్యం అందించేందుకు గాను పూర్తి సహాయ సహకా రాలు అందించడం అభినందనీయమన్నారు. సూపరింటెండెంట్ వెంట దవాఖాన జనరల్ సర్జరీ విభాగధిపతి డాక్టర్ సద్గుణాచారి, ప్రొఫెసర్లు డాక్టర్ సిద్దిపేట రమేశ్, డాక్టర్ రంగాచారి తదితరులు ఉన్నారు.

372

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles