ఫలితాలిస్తున్న 17 వెర్టికల్స్ సిద్ధాంతం

Sun,December 16, 2018 12:17 AM

-38 కేసుల్లో 47 మందికి శిక్షలు
-సిబ్బందికి రివార్డులు అందించిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కేసుల దర్యాప్తులో పని విభజన కోసం ఏర్పాటు చేసుకున్న 17వెర్టికల్స్ సిద్ధాంతం సక్సెస్ అవుతున్నది. 17 వర్టికల్స్ కింద కేసుల దర్యాప్తుకు సంబంధించి వివిధ అంశాల్లో ఎవరు పనిని ఆ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో నేరస్తులకు శిక్షలు పడడం ఖాయంగా మారింది. గతంలో ఇలాంటి సమన్వయం లేకపోవడంతో చాలా కేసుల్లో చిన్న చిన్న లోపాలతో విచారణలో దర్యాప్తు అంశాల్లో లోటుపాట్లు కనపడడంతో చాలా కేసులో నిందితులకు శిక్షలు పడకుండానే వీగిపోయేవి. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు రాచకొండ పోలీసు కమిషనరేట్ సీపీ మహేశ్‌భగవత్ 17 వర్టికల్స్‌ను అమలు చేసేందుకు సిబ్బందికి దర్యాప్తు, విచారణలు, ఆధారాలు, సాక్ష్యాలు సేకరించాల్సి పద్ధతులపై నిత్యం అవగాహనను కల్పిస్తుండడంతో ఇప్పుడు అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో కమిషనరేట్ పరిధిలో మొత్తం 38కేసుల విచారణలు పూైర్తె 48మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. దీంతో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు చాలా మంది బాధిత కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నది. మరో వైపు క్రిమినల్స్‌లో దడ పుట్టిస్తుంది. ఈ 38 కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా పని చేసిన సిబ్బందిని శనివారం సీపీ మహేశ్‌భగవత్ అభినందించి వారికి రివార్డులను అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రాము, రాచకొండ క్రైం డీసీపీ కెఆర్.నాగరాజులు పాల్గొన్నారు.

217

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles