మల్కాజిగిరి అభివృద్ధిపై ఎంపీ మల్లారెడ్డి మార్క్

Sat,December 15, 2018 01:07 AM

కంటోన్మెంట్ (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి రాజీనామా సమర్పించారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను కలిసి మల్లారెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ పదవిని మల్లారెడ్డి వదులుకున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో మల్కాజిగిరి అభివృద్ధి కోసం మల్లారెడ్డి అహర్నిశలు శ్రమించారు. రూ.వేల కోట్ల నిధులతో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా తీర్చిదిద్దినట్లు మల్లారెడ్డి నమస్తే తెలంగాణప్రతినిధికి తెలియజేశారు. డబుల్ బెడ్ రూమ్ పథకం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనే విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.2వేల కోట్ల వ్య యంతో 38వేల రెండు పడకల గదుల ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సింగం చెరువు తండాలో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా, మిగిలిన ప్రాంతాల్లో వేగవంతంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ నియోజకవర్గంలో రూ.1400 కోట్లు వెచ్చించారు. 56 రిజర్వాయిర్లు 284 కిలో మీటర్ల ట్రంక్‌లైన్,2624 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లు, ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 202 గ్రామాలకు రూ.628 కోట్లతో పూర్తిచేసి ఇంటింటికి తాగునీరు అందించారు.12 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని ఉప్ప ల్ భగాయత్ రైతుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం..753 ఎకరాల స్థల సమస్యను పరిష్కరించి, లబ్దిదారులకు స్థలాన్ని కేటాయించడంలో కీలక భూమిక పోషించారు.

ఎల్.బి.నగర్, నాగోల్, బి.ఎన్.రెడ్డి నగర్, హస్తినాపురం డివిజన్లలో భూముల రిజిస్ట్రేషన్, ఇంటి అనుమతుల మంజూరుకు సంబంధించిన పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి మహముద్ ఆలీ,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్‌లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాడు. ఎల్.బి.నగర్,బైరామాల్‌గూడ జంక్షన్, కామినేని హాస్పిటల్ జంక్షన్‌ల వద్ద రూ.331.38 కోట్లతో ైప్లె ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. రామంతపూర్ నుంచి నారపల్లి వరకు రూ.960 కోట్లతో నిర్మించనున్న ైప్లెఓవర్‌కు నిర్మాణంలో ఉంది. రూ.385 కోట్లతో బాలానగర్ ైప్లె ఓవర్‌పనులు కొనసాగుతున్నాయి. మల్కాజిగిరిలో రూ.150 కోట్లతో 3 ఆర్‌యూబీల నిర్మాణ పను ల శరవేగంగా జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలో రూ.105 కోట్లతో ఈ ైప్లె ఓవర్లను నిర్మిస్తున్నారు. దీనికితోడు మలేషియన్ టౌన్‌షీప్ నుంచి హైటెక్ సీటి వరకు రూ. 10 కోట్లతో సర్వీస్ రోడ్డు నిర్మా ణం ఏర్పాటు చేశారు.

సంసద్ ఆవాస్ గ్రామీణ యోజనలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని 3 గ్రామాలను దత్తత తీసుకున్నారు. వీటిలో మొదటి దశలో ముఖ్యమంత్రి ప్రత్యేక సహాయ నిధితోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ.8 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం.దీనికితోడు సీఎం కేసీఆర్ శామీర్‌పేట మండలంలోని లకా్ష్మపూర్, కేశవరం,మూడు చింతలపల్లి గ్రామాల అభివృద్ధి కోసం రూ.62 కోట్లు మంజూరు చేశారు. ఇందులో ప్రధానంగా కేశవరం చెరువుకు అనుసంధానంగా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.80 కోట్లతో కంటైనర్ లాజిస్టిక్ టెర్మినల్‌గా అధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడ్చల్, శామీర్‌పేట్, గండిమైసమ్మ, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రెండు క్రీడా ప్రాంగణాల, ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఎల్.బి.నగర్‌లో 3200 గజాలలో నూతంగా ఒక స్పోర్ట్ కాం ప్లెక్స్ ఏర్పాటు కోసం రూ.6 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నియోజకవర్గాన్ని బాహ్య మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు 77 గ్రామ పంచాయితీలలో 4,377 కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం. జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో ప్రతి సర్కిల్‌కు 5 ఆధునిక లూ-కేప్‌లను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా 1.28 కోట్ల మొక్కలను నాటినట్టు మల్లారెడ్డి
నమస్తే తెలంగాణ కు వివరించారు.

612

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles