విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు హాక్‌థాన్ లీగ్

Sat,December 15, 2018 01:07 AM

కేపీహెచ్‌బీ కాలనీ : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా జేహబ్ హాక్‌థాన్ లీగ్‌ను ప్రవేశపెట్టినట్టు జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ఎ.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వర్సిటీలో జేఎన్‌టీయూహెచ్, జేఎహెచ్‌యూబీ/జే ల్యాబ్స్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న జేహబ్ హాక్‌థాన్ లీగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్ విద్యా ర్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచి విద్యార్థుల్లో పరిశోధనల వైపు ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. జేహబ్ హాక్‌థాన్ లీగ్‌తో ఇంజినీరింగ్ పట్టభద్రులు, పరిశ్రమల సలహాదారులు, పారిశ్రామిక వేత్తలకు ఎంతగానో దోహదం చేస్తుందని తెలి పారు. ఏఐసీటీఈ వైస్ చైర్మన్ ఎంపీ పూనియా మాట్లాడుతూ గ్రామీణ భారతీయ విద్యార్థులను ప్రోత్స హించాల్సిన అవసరముందన్నారు. జేహబ్ హాక్‌థాన్ లీగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను వివిధ సంస్థ లు పరిశీలిస్తారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. జేహబ్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, అధికారులు పాల్గొన్నారు.

267

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles