ఆన్‌లైన్ మోసాలపై అవగాహన అవసరం

Sat,December 15, 2018 01:06 AM

-సైబరాబాద్ సీపీ సజ్జనార్
కొండాపూర్: ముందస్తు అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలను నివారించవచ్చని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ చీటింగ్‌పై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలపై మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న విధానాలతో పాటు అమాయక ప్రజలను సైబర్ చీటర్ల భారీ నుంచి కాపాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగర వాసుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం కమిషనరేట్ పరిధిలోని అన్ని మాల్స్, స్కూళ్లు, కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, ఫ్లెక్సీలు షార్ట్ ఫిల్మ్‌లు, కళాబృందాల ఏర్పాటు ద్వారా ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్)లను ఎవరితో షేర్ చేసుకోకూడదని తెలిపారు. ముఖ్యంగా మాల్స్, సినిమా థియేటర్స్, షాపింగ్‌లకు వెళ్లిన చోట ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన సమాచారాలను కొత్త వ్యక్తులతో చర్చించడం శ్రేయస్కారం కాదన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే ఇతరులకు చేరవేయాలన్నారు. తప్పుడు సమాచారంతో ఫ్రీ గిఫ్ట్‌లు, తక్కువ చెల్లిస్తే ఎక్కువ మొత్తంలో లాభాలంటూ వచ్చే పుకార్లను నమ్మకూడదని, దీంతో పాటు లాటరీల పేరిట వచ్చే ఫోన్ కాల్స్‌కు వెంటనే సమాధానం ఇవ్వకూడదని, క్షుణ్ణంగా వివరాలను తెలుసుకుని, వారు చెప్పే మాటలు వాస్తవమా, కాదా.. అన్ని విషయాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనుమానంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.డీసీపీ క్రైమ్ జానకి షర్మిల, ఏసీపీ క్రైమ్ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ రవీందర్ పాల్గొన్నారు.

359

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles