ప్రజాకూటమిని తిప్పికొట్టారు..

Sat,December 15, 2018 01:06 AM

బేగంబజార్: రాష్ట్రంలో కులం పేరు చెప్పుకొని యావత్ మాల మాదిగలు తమ వెంటే ఉన్నారని, దళిత జాతి మధ్య చిచ్చుపెట్టి వర్గీకరణకు పెద్దపీట వేసిన ప్రజాకూటమికి తాకట్టు పెట్టిన మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, గద్దర్‌లను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని జాతీయ మాలల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు ఆవుల బాలనాధం పేర్కొన్నారు. దూర దృష్టితో సీఎం కేసీఆర్ మాల మాదిగలకు సమనంగా చూస్తున్నందున రాష్ట్రంలో ఉన్న సుమారు 35 లక్షల మంది మాలలందరూ టీఆర్‌ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా ఓటు వేశారన్నారు. శుక్రవారం కోఠిలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండోసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీయడంతో ఆ ప్రభంజనానికి ప్రజా కూటమి గల్లంతయ్యిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కేసీఆర్‌కు,టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్ మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో మాలమాదిగలు తమ వైపే ఉన్నారని ప్రజా కూటమికి తాకట్టు పెట్టిన ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, ప్రజా గాయకుడు గద్దర్‌కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధ్ది చెప్పారన్నారు. సంఘం జాతీయ కార్యానిర్వహక అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ, సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రొయ్య కృష్ణప్రసాద్, సిద్ధ్దిపేట అధ్యక్షుడు మణిదీప్, రంగారెడ్డి ఇన్‌చార్జి మనోజ్‌కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

194

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles