200 ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు

Sat,December 15, 2018 01:05 AM

సిటీబ్యూరో:గ్రేటర్ పరిధిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రైస్తవులకు 200 ప్రాంతాల్లో 18 నుంచి 20వ తేదీ వరకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రిస్మస్ నిర్వహణపై శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ ఎం. దానకిశోర్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఆ శాఖ డైరెక్టర్ షానవాజ్ హుస్సేన్‌తో పాటు కార్పొరేటర్లు, వార్డు కమిటీలు, ఏరియా సభల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవేమిటంటే.. n జీహెచ్‌ఎంసీ పరిధిలో 200 ప్రాంతాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌లు, క్రిస్మస్ విందు ఏర్పాటు చేయడం. ఇందుకోసం ప్రతి డివిజన్‌లో ఓ చర్చి ప్రాంతాన్ని సంబంధిత కార్పొరేటర్ గుర్తించాలి.n ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు ప్రాంతాలను సంబంధిత ఎమ్మెల్యే ఎంపిక చేయాలి.n ప్రతి లొకేషన్‌లో 500 మందికి గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయాలి. n డిసెంబర్ 18న క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహణ.n క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీలో నిరుపేదలు, దివ్యాంగులు, వితంతువులు, అనాథలు తదితరులకు ప్రాధాన్యత n 17న సాయంత్రం నాంపల్లి హజ్‌హౌస్ భవన్ నుంచి క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ.

235

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles