నేర రహిత సమాజమే ధ్యేయం

Sat,December 15, 2018 01:05 AM

చార్మినార్:శాంతిభద్రతల విషయంలో రాజీపడమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హోం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా మక్కా మసీదును శుక్రవారం సందర్శించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు శాఖ నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు. పోలీసుశాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తగిన సహకారాన్ని, అవసరమైన నిధులను అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాల మేరకు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నేర రహిత సమాజం కోసం నిరంతరం సర్కారు కృషి చేస్తుందన్నారు. నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరం చేసిన ఐదు నిమిషాల్లోపు ఘటనాస్థలికి పోలీసులు చేరుకునేలా ఇప్పటికే పూర్తి స్థాయి వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అల్లర్లతో పాటు ఇతర ఏ విధమైన ఘర్షణ వాతావరణం తలెత్తలేదని గుర్తు చేశారు. నగరంలో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. మక్కా మసీదులో ప్రస్తుతం 32 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి అంగుళాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నామన్నారు. హోం మంత్రి వెంట చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

159

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles