పుస్తకాల పండుగ.. రేపటినుంచే

Fri,December 14, 2018 12:48 AM

-15 నుంచి నేషనల్ బుక్ ఫెయిర్
-ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన
-ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి హాజరు
-ప్రాంగణం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర ప్రజల ఓటు.. అభివృద్ధి పరుగుల వేగం పెంచేలా చేసింది. విశ్వనగర ప్రణాళికలు ఊపందుకొనేలా మార్చింది. సిగ్నల్ ఫ్రీ కారిడార్లు, మోడల్ మార్కెట్లు, బహుళ ప్రయోజనకర ఫంక్షన్ హాళ్లు, పాతబస్తీ అభివృద్ధి, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ను దాదాపు రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన రోడ్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు రూ. 23 వేల కోట్ల అంచనాతో చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) ఇందులో ప్రధానమైనది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే రూ. మూడు వేల కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. వెస్ట్‌జోన్‌లో అయ్యప్ప సొసైటీ, మైండ్‌స్పేస్ జంక్షన్, ఎల్బీనగర్‌లో చింతలకుంట అండర్‌పాస్‌లు, కామినేని జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్‌లో రెండు ైఫ్లెఓవర్లు పూర్తయ్యాయి.

మరో రూ. 10 వేల కోట్లతో చేపట్టనున్న పనులు.. టెండర్ల దశలో ఉన్నాయి. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రణాళికలకు అంకురార్పణ చేశారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ పనుల పురోగతిపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ, సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండోసారి టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగే అవకాశాలున్నాయి. సుమారు రూ. 1500 కోట్లతో నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఎక్స్‌ప్రెస్ వే పనులు ప్రారంభమయ్యాయి. రోడ్లపై గుంతలు లేకుండా సుమారు రూ. 721 కోట్లతో పిరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో హైదరాబాద్ విశ్వనగరంగా పురోగమిస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సరం నిర్వహించిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు పది లక్షల మందికి పైగా పుస్తకప్రియులు వచ్చారు. ప్రస్తుతం 32వ జాతీయ పుస్తక ప్రదర్శనకు హైదరాబాద్ మహా నగరం వేదికైంది. ఈ నెల 15వ (శనివారం) తేదీ మొదలుకుని, 25వ (మంగళవారం) తేదీ వరకు కొనసాగనుంది. ఈ పుస్తకోత్సవానికి గాను ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

11 రోజుల పండుగ
హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో పదకొండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. ఈ పండుగలో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ర్టాలు పాల్గొననున్నాయి. 330 స్టాల్స్‌తో పలువురు పబ్లిషర్స్ పాల్గొననున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాష, ఇంకా మరెన్నో భాషల పుస్తకాలు ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి. తెలుగు భాషకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు పాల్గొంటున్నారు.

బాల వికాస్ కార్యక్రమాలు
ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాల బాలికలకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం పోటీలు, బృంద నృత్య పోటీలు, బృందగాన పోటీలు, సోలో పాటల పోటీలు, ఒక్క నిమిషం తెలుగు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్య పోటీలు, బాలల ఇంద్రజాల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇంకా పలు అంశాలపై బాలబాలికలకు వర్క్‌పాపులు నిర్వహిస్తున్నారు.

భారీగా ఏర్పాట్లు
ప్రదర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బుక్ ఫెయిర్ నిర్వాహకులు, పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బుక్ ఫెయిర్ ప్రధాన ప్రాంగణానికి ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి పేరును పెట్టారు. ప్రాంగణంలోని ప్రధాన వేదికకు హైదరాబాద్ మాజీ ఎంపీ సంగెం లక్ష్మీబాయి పేరును ఏర్పాటు చేశారు. మరో వేదికకు ఖమ్మం జిల్లాకు చెందిన జాతశ్రీ పేరును పెట్టారు.

ప్రారంభ సభ..
బుక్ ఫెయిర్ ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథిగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, గౌరవ అతిథులుగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు విచ్చేస్తున్నారు. కాగా, ప్రారంభ సమావేశం శనివారం సాయంత్రం 5:30 గంటలకు జరుగనుంది.

668

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles