టీడీపీ, బీజేపీ డీలా

Wed,December 12, 2018 01:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 9, బీజేపీ 5 సీట్లు గెలుచుకుని బీజేపీ టీడీపీ కూటమి 14 సీట్లు సాధించగా, ఈ దఫా చతికిలపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో గోషామహల్ మినహా సీట్లన్నీ బీజేపీ కోల్పోగా, తెలుగుదేశం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఎంఐఎం స్థానాల్లో ఎలాంటి మార్పురాకపోగా, బీజేపీ బలం తగ్గి ఒక స్థానంతో సరిపెట్టుకుంది. సింగిల్ డిజిట్‌తో ఉన్న టీఆర్‌ఎస్ గ్రేటర్లోని 24 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లుగానే అసెంబ్లీ స్థానాల్లో కూడా అత్యధిక నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పార్టీలను దెబ్బతీసి టీఆర్‌ఎస్‌ను ముందంజలో నిలిపాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం7, బీజేపీ 5, టీడీపీ9, టీఆర్‌ఎస్3 సీట్లు గెలుచుకోగా ఈ దఫా టీడీపీ, బీజేపీకీ గట్టి దెబ్బతగిలింది. 24 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల శాతం క్రింది విధంగా ఉంది. గతంలో టీడీపీ లో గెలిచిన అభ్యర్థులు టీఆర్‌ఎస్ వి ధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.

349

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles