పట్టాలపై మొరాయించిన గూడ్స్ రైలు

Thu,December 6, 2018 12:22 AM

కాచిగూడ : రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో కాచిగూడ నుంచి డోన్‌కు హెవీ ఐరన్ లోడ్‌తో బయలుదేరిన గూడ్స్‌రైలు ఇంజిన్ మంగళవారం రాత్రి సాంకేతిక లోపంతో ఒక్కసారిగా డబీర్‌పుర రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పై 3 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో కాచిగూడ, విద్యానగర్, జామై ఉస్మానియా రైల్వేస్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్ రైళ్లు ఆగిపోయా యి. ఏం జరుగుతుందోనని రైల్వే ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 9.45 గంటల సమయంలో డబీర్‌పుర రైల్వేస్టేషన్ సమీపంలో కాచిగూడ నుంచి డోన్‌కు బీటీపీకే నంబర్ గల హెవీ ఐరన్ లోడ్‌తో బయలుదేరిన గూడ్స్ రైలు ఇంజిన్ సాంకేతిక లోపం ఏర్పడడంతో ఒక్కసారిగా డబీర్‌పుర రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపైనే 3 గంటలపాటు నిలిచిపోయింది. అర్ధరాత్రి 12 గంటల వరకు గూడ్స్ రైలు సాంకేతిక సమస్యను రైల్వే అధికారులు, సిబ్బంది పరిష్కరించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కాచిగూడ రైల్వేస్టేషన్‌లో యశ్వంత్‌పూర్‌కు వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలపైనే నిలిచిపోయా యి. దీంతో ఫలక్‌నమా, మహబూబ్‌నగర్ తదితర ప్రాం తాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి తరువాత స్పందించిన అధికారులు గూడ్స్ రైలుకు 3 గంటల తరువాత మరో రెండు ఇంజిన్లను జత చేసి డోన్‌కు పంపించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో కాచిగూడ ఇతర రైల్వేస్టేషన్‌ల నుంచి ఎక్స్‌ప్రెస్, ఎంఎంటీఎస్ రైళ్లు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరాయి.

188

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles