దివ్యాంగుల సేవలకు మూడు వేలమంది వలంటీర్లు

Thu,December 6, 2018 12:21 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ జిల్లాలో దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల వరకు వారిని చేర్చడంతోపాటు వారికి అవసరమైన సేవలు అందించేందుకు సుమారు మూడు వేలమంది వలంటీర్లను నియమిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం. దాన కిశోర్ తెలిపారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన వలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివ్యాంగుల సౌకర్యార్థం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులను నిర్మించినట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లను సిద్ధంచేసినట్లు చెప్పారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు తదితరులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగు సహాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. ప్రతి వలంటీర్ తప్పనిసరిగా ఎన్నికల విధులకు సంబంధించిన టీ-షర్ట్‌ను ధరించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్దులు తదితరులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు టేబుల్-1, పీఓ, ఏపీఓల వద్దకు తీసుకొని వెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల ఓటర్ల సంఖ్య , ప్రతి గంటకూ పోలైన వారి ఓటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని దానకిశోర్ సూచించారు.

195

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles