సవాళ్లను అధిగమిస్తేనే విజయం

Fri,November 16, 2018 12:32 AM

జవహర్‌నగర్ : అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాలలో ఏన్నో సవాళ్లను అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందని ఇండియన్ హ్యూమన్ స్పెస్ ైప్లెట్ ప్రోగ్రాం ఇస్రో డైరెక్టర్ డాక్టర్ వీఆర్ లలితాంబికా తెలిపారు. గురువారం జవహర్‌నగర్‌లోని బిట్స్‌పిలానీ క్యాంపస్‌లో ఇండియన్ హ్యూమన్ స్పెస్ ైప్లెట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన డాక్టర్ వీర్ లలితాంబికా విద్యార్థులకు లఘు చిత్రం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం వాటి ఉపయోగాలు, అధిగమించాల్సిన విపత్కర పరిస్థితులను వివరించారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలో తీవ్రమైన శక్తి, ఉష్ణోగ్రత, వేగం, పీడనాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన అంశాలను విద్యార్థులకు సూచించారు. 1963 నుంచి మొదలైన అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాలు నేడు ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ ఎంకే-3 ఉప గ్రహ ప్రయోగం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నింగిలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌తో పాటు దుబాయ్, గోవా బిట్స్ క్యాంపస్ విద్యార్థులచే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బిట్స్ పిలానీ డైరెక్టర్ సుందర్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

213

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles