నామినేషన్ల జోరు..

Thu,November 15, 2018 12:40 AM

-హైదరాబాద్ జిల్లాలో 44.. మేడ్చల్ జిల్లాలో 20 నామినేషన్లు దాఖలు
-మరింత ఊపందుకున్న టీఆర్‌ఎస్ ప్రచారం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నామినేషన్ల పర్వం జోరందుకున్నది. హైదరాబాద్ జిల్లా పరిధిలో బుధవారం 44, మేడ్చల్‌లో 20 నామినేషన్లు దాఖలయ్యాయి. సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తరఫున ఆయన సన్నిహితులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ ఉప్పల్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి, మలక్‌పేట అభ్యర్థి సతీశ్‌కుమార్, కార్వాన్ అభ్యర్థి జీవన్‌సింగ్‌లు స్వయంగా వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నాంపల్లి అభ్యర్థి ఆనంద్‌కుమార్ తరఫున ఆయన సన్నిహితులు నామినేషన్ పత్రాలు అందించారు. మరోవైపు గ్రేటర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

హైదరాబాద్ జిల్లాలో బుధవారం మొత్తం 30 మంది అభ్యర్థులు 44 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు. వీరిలో కొందరు పార్టీ అభ్యర్థులు కాగా, పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్, మలక్‌పేట్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీ. సతీశ్‌కుమార్, అంబర్‌పేట్ నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పి. చిన్నలింగన్న, పిరమిడ్ పార్టీ నుంచి వి.కె. ఉపేంద్ర, టీడీపీ నుంచి వనం రమేశ్, ఖైరతాబాద్ స్థానానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ నుంచి హేమలత, టీడీపీ నుంచి నర్సింహారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా రంజిత్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అబ్దుల్లా ఇబ్రహీం, కాంగ్రెస్ అభ్యర్థిగా పి. విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఎస్. సుమిత్ర, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్వతంత్ర అభ్యర్థిగా ఎ. శ్రీనివాస్, నాంపల్లి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్, కార్వాన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీ. జీవన్‌సింగ్,

గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖేష్‌గౌడ్, స్వతంత్ర అభ్యర్థిగా బి.వి. రమేశ్‌బాబు, యాకుత్‌పురా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సామ సుందర్‌రెడ్డి, శివసేన అభ్యర్థిగా జమాల్‌పూర్ మహేశ్‌కుమార్, మజ్లీస్ అభ్యర్థిగా సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్. సుజాత, సికింద్రాబాద్ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా అనిల్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా ఎస్. సాయికిరణ్, బహుజన రాజ్యం పార్టీ అభ్యర్థిగా ఎం. సునిత, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం. మన్మోహన్, స్వయంత్ర అభ్యర్థులుగా జీ దయామణి, గణేశ్‌నారాయణ, గజ్జెల నాగేశ్వర్‌రావు తదితరులు నామినేషన్లు వేశారు. ఈనెల 12వ తేదీ మొదటి రోజు ఐదు నామినేషన్లు, రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

నాంపల్లిలో మొదటి నామినేషన్
మెహిదీపట్నం: నాంపల్లి నియోజకవర్గంలో మూడో రోజు బుధవారం ఎట్టకేలకు ఒక నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తరఫున రెడ్‌హిల్స్‌కు చెందిన ప్రదీప్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. అనురాధకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా బీ ఫారాన్ని శనివారం అందజేస్తామని టీఆర్‌ఎస్ అభ్యర్థి సీహెచ్.ఆనంద్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద అభ్యర్థి ఆనంద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ శనివారం కార్యకర్తలు, నాయకులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి బీ ఫారం అందజేస్తానని తెలిపారు.

టీఆర్‌ఎస్ ఉప్పల్ అభ్యర్థి బేతి నామినేషన్
ఉప్పల్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బండారి లకా్ష్మరెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా హబ్సిగూడలోని బేతి సుభాష్‌రెడ్డి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరై మద్దతు తెలిపారు. కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, పజ్జూరి పావనీమణిపాల్‌రెడ్డి, పన్నాల దేవేందర్‌రెడ్డి, స్వర్ణరాజ్, శాంతీసాయిజెన్ శేఖర్, మేకల అనలాహన్మంతరెడ్డి, బేతి స్వప్నారెడ్డి, గంధం జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, గోపు సరస్వతి సదానంద్, డివిజన్ అధ్యక్షులు, వార్డుసభ్యులు, సీనియర్ నాయకులు, పలువురు అభిమానులు హాజరై బేతికి అండగా నిలుస్తామని తెలిపారు. హబ్సిగూడ నుంచి అభిమానుల ఆశీర్వాదంతో బయలుదేరి ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు బండారి లకా్ష్మరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు.

మలక్‌పేట అభ్యర్థిగా సతీశ్‌కుమార్ ..
సైదాబాద్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ మలక్‌పేట అభ్యర్థి చెవ్వ సతీష్‌కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మలక్‌పేట ఎన్నికల రిటర్నింగ్ అధికారి పడాల అశోక్‌కుమార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకు ముందు సైదాబాద్ ప్రసన్నాంజనేయస్వామి కాలనీలోని తన నివాసం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ప్రసన్నాంజనేయస్వామి, జీవన్‌జ్యోతి సంఘంలో శ్రీజయదుర్గా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజం అలీ, సైదాబాద్, మూసరాంబాగ్ డివిజన్ల కార్పొరేటర్లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, తీగల సునరితారెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయ భువనేశ్వరి, డైరెక్టర్లు దుగ్గు జగదీశ్, రాధ తదితరులు హాజరై ఆయనకు మద్దతు తెలిపారు.

కార్వాన్ అభ్యర్థిగా జీవన్‌సింగ్..
మెహిదీపట్నం: టీఆర్‌ఎస్ కార్వాన్ అభ్యర్థి ఠాకూర్ జీవన్‌సింగ్ బుధవారం కార్వాన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సూర్యలతకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జీవన్‌సింగ్‌తో పాటు కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, ఎ.కృష్ణ ఉన్నారు. కాగా జీవన్‌సింగ్‌కు గుడిమల్కాపూర్ శివబాగ్ గాయత్రినగర్‌లో సొంత ఇల్లు, సియాజ్ కారు, వికారాబాద్ కోడూరులో 2 ఎకరాలు పొలం, 2 లక్షల 21 వేల రూపాయల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు, తన కుమారుడి వద్ద 103 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం
బేగంపేట: టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని సనత్‌నగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం బేగంపేట డివిజన్‌లోని భగవంతపూర్, షేర్‌ఖాన బస్తీల్లో కార్పొరేటర్ ఉప్పల తరుణి, మాజీ కార్పొరేటర్ మహేశ్వరీశ్రీహరి, కోషికే కిరణ్మయికిశోర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల రూప, నాయకులు సామా ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


సంక్షేమం కోసం కారుకే ఓటేస్తారు
-కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు
బాలానగర్ : సంక్షేమం కోరుకొనే వారందరూ కారు గుర్తుకే ఓటేస్తారని కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలో కార్పొరేటర్లు కాండూరి నరేంద్రాచార్య, పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రచారం చేశారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని పూల్‌బాగ్‌కాలనీ, గీతానగర్, నవజీవన్‌నగర్, దాసరిబస్తీలలో విస్తృతంగా పర్యటించారు. ఫతేనగర్ డివిజన్‌లోని ఇందిరాగాంధీపురం, ఎల్బీశాస్త్రీనగర్, నాగార్జునకాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి కారుగుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎడ్ల మోహన్‌రెడ్డి, మందడి సుధాకర్‌రెడ్డి, కె రాములు. భగవంత్‌రెడ్డి, భిక్షపతి, పీ సభాపతిరెడ్డి, రాంచందర్ ముదిరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, దాసరి నగేశ్, యెలిజాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


మహిళల సంక్షేమానికి పథకాలు
-మహేశ్వరం అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి
బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మహేశ్వరం అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మీర్‌పేటలో ఎంపీటీసీ చల్వాది రాజేశ్ కుమార్, తెలంగాణ జాగృతి మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ లావణ్య ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తీగల అనితారెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్‌లో ఉన్న వారికి ఓట్లు వేస్తే మన సమస్యలు తీరవన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు లలితాజగన్, జి.లలిత, తీగల తులసీరెడ్డి, తీగల అమర్‌నాథ్‌రెడ్డి, భవాని, అడప రవి, కూన యాదయ్య, చంద్రయ్య, మోహన్‌రెడ్డి ఉన్నారు.

మేడ్చల్ జిల్లాలో 20 నామినేషన్లు
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో మూడో రోజు బుధవారం 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించామని జిల్లా ఎన్నికల అధికారి ఎంవీరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 25 నామినేషన్లు స్వీకరించామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు..

మేడ్చల్ నియోజకవర్గం..
పెద్ది మోహన్‌రెడ్డి (బీజేపీ), కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి
(కాంగ్రెస్), నీరడి హిమవతి (స్వతంత్ర) మల్కాజిగిరి..
గోపు రమణారెడ్డి (స్వతంత్ర), ఎన్. రాంచందర్‌రావు (బీజేపీ), కపిలవాయి దిలీప్‌కుమార్ (తెలంగాణ జన సమితి), బొబ్బిలి పావనీరెడ్డి (స్వతంత్ర), ఎస్ మధుమోహన్ (స్వతంత్ర), కందిబండ నర్సింహారావు (స్వతంత్ర), రాసూరి అనిల్ కుమార్ (స్వతంత్ర), గరేష అశ్విన్‌కుమార్ (స్వతంత్ర)

ఉప్పల్..
బంటు అనిల్ కుమార్ (ద ఫ్యూచర్ ఇండియా పార్టీ) గద్ద యుగేందర్ (బీఎస్‌పీ), సి.జగదీశ్ చౌదరి (శివసేన), కర్రి వెంకోజీ రావు (స్వతంత్ర), మార్తినేని ప్రియాంక (ఆమ్ ఆద్మీ), బేతి సుభాష్ రెడ్డి (టీఆర్‌ఎస్), తూళ్ల వీరేందర్ గౌడ్ (టీడీపీ).
కుత్బుల్లాపూర్..
కూన శ్రీశైలం గౌడ్ (కాంగ్రెస్)
కూకట్‌పల్లి.. గొట్టిముక్కల వెంగళ్‌రావు (కాంగ్రెస్)

458

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles