హీరా గ్రూప్ నిర్వాహకురాలు

Wed,November 14, 2018 12:17 AM

-నౌహీరా షేక్ బెయిల్ రద్దు
-ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసుల అదుపులో నిందితురాలు
-పీటీ వారెంట్‌పై నగరానికి తరలించేందుకు సీసీఎస్ యత్నాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హీరా గ్రూప్స్ నిర్వాహకురాలు నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్‌ను మంగళవా రం హైకోర్టు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అమా యక ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఫిర్యాదులపై గత నెలలో నౌహీరా షేక్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చెబుతున్న విషయాలకు.. ఆదాయ వనరులకు ఎక్కడ కూడా పొంతన లేదని, మన దేశంతో పాటు ఇతర దేశాల్లోను ఆమె బాధితులు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై మహారాష్ట్ర, ఏపీలలోను కేసు లు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం చాలామంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గత నెల 24న ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె నుంచి చాలా సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, ఆమె ఆదాయ మూలాలపై అనుమానాలు ఉన్నాయని, ఇందులో దేశ భద్రతకు సం బంధించిన అంశాలు కూడా ఉన్నాయని సీసీఎస్ పోలీసులు, ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ పోలీసుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి, కింది కోర్టు ఆమెకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. దీంతో ఇప్పుడు నౌహీరా షేక్‌ను మరోసారి తమ అదుపులోకి తీసుకోవాలని సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో బెయిల్ పొంది, చంచల్‌గూడ మహళా జైలు నుంచి విడుదల కాగానే ఆమెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్కడి న్యాయస్థానంలో ఆమెను హాజరు పరిచి, కోర్టు అనుమతితో రెండు దఫాలుగా ఆమెను కస్టడీలోకి తీసుకొని అక్కడి పోలీసులు విచారించారు. ఆమెను పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆమెపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోను కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకొని విచారించే యత్నం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీలోను నౌహీ రా షేక్‌పై కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇలా ఆమెను విచారించేందుకు ఇప్పుడు పలు రాష్ర్టాల పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ సంస్థకు సాప్ట్‌వేర్ అందించిన బిజుథామస్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి, కొంత సమాచారాన్ని తీసుకున్నారు. అయితే పోలీసులు ఉహించినంత మేర సమాచారం అతని నుంచి రాలేదని తెలుస్తుంది. బం జారాహిల్స్ కేంద్ర కార్యాలయంలోని సర్వర్ల హార్డ్ డిస్క్‌లను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించినా పూర్తి సమాచారం రాలేదు. పూర్తి వివరాలను నౌహీరా షేక్ మాత్రమే చెప్పే వీలుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలువనున్నాయి.

303

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles