ఆహార పద్ధ్దతుల్లో సమతుల్యంపై సదస్సు

Tue,November 13, 2018 12:24 AM

తార్నాక, నవంబర్ 12 : ప్రపంచీకరణలో వస్తున్న మార్పులు మానవళి మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తుందని పోషకహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్నాకలోని జాతీయ పోషకహార సంస్థ(ఎన్‌ఐఎన్)లో శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ఆహార పద్ధ్దతుల్లో సమతుల్యం ద్వారా పౌష్టికహారం పెంపుదల అనే అంశంపై రెండో రోజు అంతర్జాతీయ స్థాయి సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా 12 దేశాల నుండి వచ్చిన పోషక నిపుణులు, శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయా దేశాల్లో వ్యవసాయరంగంలో తీసుకొస్తున్న నూతన విధానాలు, ప్రకృతి సిద్ధ్దంగా అందుతున్న ఆహార పదార్థాలు, పండ్లు, ఇతర కూరగాయాలు ఏ విధంగా పండిస్తున్నారు, వాటిని ఎలా వాడుతున్నారు వంటి అంశాలపై చర్చించుకున్నారు. భవిష్యత్‌లో ఆహార ఉత్పత్తులను పెంచడంతో పాటు ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని అధిక సంఖ్యలో సేద్యం చేసేలా తీసుకోవాల్సిన ప్రణాళికలను సిద్ధ్దం చేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం నాలుగు సెషన్‌లో జరిగిన సదస్సులో ప్రధాన స్పీకర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రదర్శనలో భిన్నరకాల పండ్లు
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సులో ప్రధానంగా నలుమూలల పండించే ఆహార ఉత్పత్తులను ప్రదర్శనలో పెట్టారు. అనేక రకాలైన కాయకూరలు, గింజలు, ధాన్యాలు, మొలకలు, దుంపగడ్డలు, ధాన్యం తదితర వంటివి ఏర్పాటు చేశారు. ఆయా దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, పీహెచ్‌డీ విద్యార్థులు ప్రదర్శనలను సందర్శించి, వాటి ఉపయోగాలు, పండించే పద్ధతులను తెలుసుకున్నారు.

197

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles