గ్రేటర్‌లో అద్భుతఫలితాలు

Mon,November 12, 2018 12:58 AM

-మెజారిటీ స్థానాల్లో విజయం ఖాయం
-మంత్రి కేటీఆర్‌కు నగర ప్రచార బాధ్యతలు
-వచ్చే నెల 3న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ
-ప్రచారంలో కారు స్పీడును ఎవరూ అందుకోలేరు
-బస్తీ సమావేశాలు నిర్వహించండి
-అభ్యర్థులతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అద్భుత ఫలితాలు సాధించబోతున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందజేశారు. నామినేషన్ల నియమ నిబంధనలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో కేసీఆర్ మాట్లాడారు. గ్రేటర్‌లో కారు స్పీడ్‌ను విపక్షాలు అందుకోలేని స్థాయిలో రెండు నెలల ప్రచారం సాగిందని, కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో మరింత కష్టపడాలని సూచించారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

గ్రేటర్‌లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు టీఆర్‌ఎస్‌కు ఓటు బ్యాంకుగా మారారని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపారు. ప్రధానంగా రానున్న రోజుల్లో ప్రచారంలో మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూనే అభ్యర్థుల తరఫున పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, సభలు నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల 3న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను టీఆర్‌ఎస్ నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రేటర్ అభ్యర్థుల తరఫున సభకు సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా గ్రేటర్ ప్రచార బాధ్యతలు మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఇప్పటికే గ్రేటర్‌లో మన నగరం-మన హైదరాబాద్, ఆత్మీయ సమావేశాలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్న మంత్రి కేటీఆర్ రానున్న రోజుల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.

అభ్యర్థుల్లో నయా జోష్
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ... కూటమిలో సీట్ల సర్ధుబాట్లు, టికెట్ల పంపకాలపై సాగతీత ధోరణి కొనసాగుతుంటే గులాబీ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే రెండు దఫాలుగా ప్రచారాన్ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలను అందించి వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. రెండు దఫాలుగా అభ్యర్థులతో సమావేశమైన కేసీఆర్ ప్రచారం నుంచి నామినేషన్ దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. రానున్న 26 రోజుల పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావులకు ప్రత్యేక ప్రచార బాధ్యతలు అప్పగించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉందని, బస్తీ సమావేశాలు నిర్వహించాలని మంత్రులకు కేసీఆర్ సూచించారు.

715

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles