గాంధీలో ప్రపంచ రేడియోగ్రఫీ వేడుకలు


Mon,November 12, 2018 12:55 AM

గాంధీ దవాఖాన : రేడియోగ్రఫీ విభాగంలో కీలకమైన వైద్య సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేర్ గ్రూప్ ఆఫ్ రేడియాలజీ క్లీనికల్ డైరెక్టర్ డాక్టర్ ఎల్‌టీ కిశోర్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాల ఆవరణలోని అలూమిని ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ రేడియోగ్రఫీ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో వైద్యరంగంలో కార్పొరేట్ స్థాయి పోటీ ఉంటుందన్నారు. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంలో కలుసుకోవడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ చీఫ్ రేడియోగ్రాఫర్ రీజినల్ కోఆర్డినేటర్ మహదేవ్ చిల్లాల, వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ దవాఖాన విశ్రాంత రేడియోగ్రఫీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ఉస్మానియా దవాఖాన సీనియర్ రేడియోగ్రఫీ వైస్ చైర్మన్ మహ్మద్ అహ్మద్ మోహిద్దీన్, గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఓ.శ్రావణ్‌కుమార్, గాంధీ రేడియాలజీ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీహరి, రేడియోగ్రఫీ అసోసియేషన్ ఐఎస్‌ఆర్‌టీ అకాడమీ క్లబ్ చైర్మన్ పాండురంగారెడ్డి, సంస్థ సంయుక్త కార్యదర్శి కె.ఎల్లయ్య పాల్గొన్నారు.

182
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...