నేటి నుంచి బాలల చిత్రోత్సవం

Mon,November 12, 2018 12:53 AM

-బాలల దినోత్సవంలో భాగంగా ఐదు రోజుల పాటు పిల్లల చిత్రాల ప్రదర్శన
-తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నుంచి ఐదు రోజుల పాటు బాలల ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్రోత్సవంలో భాగంగా రోజూ రెండు చిత్రాలు.. మధ్యాహ్నం రెండు గంటలకు ఒక షో, సాయంత్రం 6:30 గంటలకు మరో షోను, మొత్తంగా పది చిత్రాలను ఐదు రోజులు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వాటిలో రెండు ఫ్రెంచ్ చిత్రాలు, మూడు జర్మన్ చిత్రాలు, ఐదు కొరియన్ చిత్రాలన్నారు. ఈ చిత్రాలన్నీ పూర్తిగా బాలల చిత్రాలేనన్నారు. ఈ చిత్రాల్లో లైవ్ యాక్షన్, 3డీ యేనిమేషన్, కార్టూన్ చిత్రాలు, ఇంకా భావోద్వేగానికి సంబంధించిన అన్ని చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాలను రవీంద్రభారతిలోని రెండో అంతస్తులోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శిస్తారని, తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని చిత్రాలను వీక్షించడానికి రావొచ్చని ఆయన తెలిపారు. పిల్లల వ్యక్తిత్వానికి తగిన చిత్రాలు, వారిలో వికాసం పెంచాల్సిన, ఇంకా ఒక స్ఫూర్తిని కలిగించే చిత్రాలు రావడం లేదని ఆయన అన్నారు.

277

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles