నామినేషన్లకు వేళాయె..

Mon,November 12, 2018 12:52 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నికల పోరులో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రేటర్‌లో సోమ వారం నుంచి వారం రోజులపాటు నామి నేష న్ల సందడి కనిపించనుంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఈ నెల 20న అధి కారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ను విత్‌డ్రా చేసుకునేందుకు ఈ నెల 22 వరకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 7న ఎన్నిక లు జరగనుండగా 11న ఓట్ల లెక్కింపు నిర్వ హిం చనున్నారు. 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యం లోనే నామినేషన్ దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ పలు నిబంధనలు రూపొందించింది. నామినేషన్ వేసే వారు దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలను భర్తీ చేయడంతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల సమర్పణ, నిబంధనల వివరాలు ఇవి...
- నామినేషన్ రుసుం రూ.10వేలు
ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు రూ.10 వేలు రుసుంను చెల్లించాల్సి ఉంటుంది.
- కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం-26 నోటరైజ్డ్ అఫిడవిట్‌ను అన్ని కాలమ్స్‌ను నింపాల్సి ఉంటుంది.
- నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేయ డానికి 48 గంటల ముందే జాతీయ బ్యాంక్‌తో తన పేరు మీద ప్రత్యేకమైన ఖాతా ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
-ఎన్నికల వ్యయం ఈ ఖాతా నుంచి నిర్వహిం చాలి. ఈ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొ త్తం సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తారు. పారదర్శ కంగా, ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుం డా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నామినేషన్ దాఖలు..నిబంధనలు
- అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయ డానికి ఫారం-2బీ సంబంధిత రిటర్నింగ్ అధి కారి నుంచి ఉచితంగా పొందవచ్చు. ఒక్క అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు.

-నామినేషన్ కోసం అభ్యర్థికి రెండు ఫొటోలు అవసరం. ఒకటి నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు, మరొకటి ఫారం-16 అఫిడవిట్‌పై పాస్‌పోర్టు సైజు.
- నామినేషన్ డిపాజిట్ రూ.10వేలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 5వేలు, తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
-గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి కి..పోటీ చేసే నియోజకవర్గ పరిధిలోని ఒక్క ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్ పార్టీ లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అభ్యర్థిని మా త్రం నియోజకవర్గ పరిధిలోని 10 మంది ఓట ర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
-ప్రతిపాదించే ఓటరు నిరక్షరాస్యులైతే నామి నేషన్ పత్రంలో వేలి ముద్రవేస్తే రిటర్నింగ్ ముందు వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది.
-గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నామి నేషన్ పత్రంలోని ఫారం-2బీ పార్ట్ 3లోని సీ కాలమ్ ఎదురుగానున్న గుర్తులను మూడిం టిని ప్రాధాన్యతా క్రమంలో రాయాల్సి ఉం టుంది.
-పోటీ చేసే అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థి కానట్లయితే అతడు నమోదైన నియో జకవర్గంలోని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకు వచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి.
-గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఏ, ఫారం-బీ ఇంకుతో సైన్ చేసిన పత్రాలను ఈ నెల 19వ తేదీ 3 గంటలలోపు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.

-ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం-26 నోటరీ ఆఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్‌ను విధిగా నింపాలి. నింపాల్సింది లేకపోతే వర్తించదని రాయలి. డాష్ కానీ ఖాళీగా కానీ వదిలి వేయ వద్దు.
-నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపై గల క్రి మినల్ కేసుల వివరాలను పార్ట్ 3 ఏలో తప్పని సరిగా పేర్కొనాలి.
-విద్యుత్, మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ, ప్రభుత్వం కేటాయించిన వసతి గృహాలకు గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి బకా యిలు లేనట్లు ధ్రువపత్రం జత చేయాలి.
-రిటర్నింగ్ అధికారికి నమూనా సంతకాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సిన పత్రాలు
-నామినేషన్ దాఖలుకు చెల్లించిన డిపాజిట్ రశీదు
-నామినేషన్ల ప్రక్రియకు హాజరుకావడానికి నోటీసు
-ఎన్నికల వ్యయం నమోదుకు రిజిస్టర్.
-కరపత్రాలు, ఫ్లెక్సీ తదితర ప్రచార సామాగ్రి ముద్రించడానికి ప్రజాప్రాతినిధ్యం సెక్షన్ 127 కింద సూచనలు
-ప్రతిజ్ఞ శపథం చేసినట్లుగా ధ్రువీకరణ
-నామినేషన్ పత్రంలోని లోపాలు, ఇంకా జత చేయాల్సిన పత్రాలతో కూడిన చెక్‌మెమో.

296

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles