వెన్నునొప్పి భరించలేక వైద్యురాలి ఆత్మహత్య

Sun,November 11, 2018 12:24 AM

బంజారాహిల్స్, (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర కాలంగా విపరీతమైన వెన్నునొప్పి వస్తుండడంతో మనోవేదనకు గురైన ఓ వైద్యురాలు భవనంపై నుం చి దూకి అత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెడ్డి పాలెంకు చెందిన ఇన్నమూరి శ్రీకాంత్ జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన కల్లూరి రూపాదేవి (31)తో 2014లో అతనికి వివాహం జరిగింది. వీరికి కార్తికేయ అనే రెండున్నర ఏండ్ల బాబు ఉన్నాడు. ఫిలింనగర్ రోడ్ నం.5లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. రూపాదేవి యశోదా దవాఖానలో పల్మనాలజిస్టుగా పనిచేస్తున్నది. కాగా ... ఏడాదిన్నర క్రితం రూపాదేవికి వెన్నునొప్పి ప్రా రంభమైంది. బెంగళూరు, గోవా, మైసూర్ ప్రాం తాల్లో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. దీంతో తీవ్ర మనోవేదనతో ఉన్న రూపాదేవి శుక్రవారం రాత్రి భవనంలోని మొదటి అంతస్తులోని బాల్కనీనుంచి కిందకు దూకింది. ఇంట్లో మనవడితో ఆడుకుంటున్న రూపాదేవి తల్లి తులసి బయటకు వచ్చి చూడగా రక్తపుమడుగులో పడి ఉంది. స్థానికుల సహాయంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

361

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles