నమ్మించి... స్క్రాప్‌తో ఉడాయిస్తారు


Sun,November 11, 2018 12:23 AM

మన్సూరాబాద్ : స్క్రాప్ కొంటామంటూ నమ్మించి.. స్క్రాప్‌తో ఉడాయిస్తున్న నలుగురిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ. 1.20 లక్షల విలువైన సామగ్రితో పాటు రూ. 76 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని ఏసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పృథ్వీధర్‌రావు కేసు వివరాలను వెల్లడించారు. ఫలక్‌నుమా, సత్తర్‌బజార్, జహానుమా ప్రాంతానికి చెందిన సోదరులు మహ్మద్ యాసిన్, మహ్మద్ మోసిన్‌లు స్క్రాప్ వ్యాపారం, అచ్చిరెడ్డికాలనీకి చెందిన సయ్యద్ నూర్‌హుస్సేన్ ఆటో డ్రైవర్‌గా, కాలాపత్తర్, మోచికాలనీకి చెందిన షేక్ ఖాజా స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నలుగురు స్నేహితులుగా మారి స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం హార్డ్‌వేర్ షాపుల్లో అమ్ముడుపోని పాత ఇంటి సామగ్రి (స్కాప్)ని అపహరించాలని పథకం వేశారు. ఇందులో భాగంగా మహ్మద్ యాసిన్, మహ్మద్ మోసిన్‌లు బైకుపై హార్ట్‌వేర్ షాపుకు వెళ్తారు. వీరి వెనుక సయ్యద్ నూర్‌హుస్సేన్, షేక్ ఖాజాలు ఆటోలో వస్తారు. షాపులో ష్కాప్‌ను కొనుగోలు చేసి ఆటోలో లోడ్ చేయించి పంపించేస్తారు. అనంతరం మహ్మద్ యాసిన్, మహ్మద్ మోసిన్‌లు బైక్‌పై పరారవుతారు. ఈ క్రమంలో వీరు ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో రెండు షాపులు, మియాపూర్ పీఎస్ పరిధిలో ఓ షాపులో స్క్రాప్‌ను కాజేశారు. షాపు యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యా ప్తు చేపట్టారు. కాగా... శుక్రవారం రాత్రి సాగర్‌రింగ్‌రోడ్డులో దొంగలించిన సొత్తును విక్రయించేందుకు వచ్చిన ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో సీఐ అశోక్‌రెడ్డి, డీఐ క్రిష్ణమోహన్, డీఎస్‌ఐ మారయ్య పాల్గొన్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...