నగర సిగలో మరో మణిహారం

Fri,November 9, 2018 12:55 AM

-నేడు మైండ్ స్పేస్ ైఫ్లెఓవర్ ప్రారంభం
-రూ.108.59 కోట్లతో నిర్మాణం
-సిగ్నల్ ఫ్రీగా మారనున్న కూడలి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ముత్యాల నగర సిగలో మరో మణిహారంగా నిలువనున్నది మైండ్‌స్పేస్ జంక్షన్ ైఫ్లెఓవర్. రూ. 108. 59 కోట్లతో కేవలం రెండేండ్లలోపే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పై వంతెనను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ప్రారంభించనున్నారు. దీంతో ఇక్కడి కూడలి పూర్తిస్థాయిలో సిగ్నల్ ఫ్రీగా మారుతుంది. వాహనాలు ఆపే అవసరం లేకుండా ఇరువైపులా ప్రయాణం సాగించవచ్చు.

మైండ్‌స్పేస్ జంక్షన్‌లో రూ.108.59కోట్ల అంచనాతో నిర్మించిన ైఫ్లెఓవర్‌ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషీ ఉదయం 10.30 గం.లకు ప్రారంభించనున్నారు. దీంతో మైండ్‌స్పేస్ జంక్షన్ పూర్తిస్థాయిలో ఫ్రీగా మారనుంది. వాహనాలు ఆపే అవసరం లేకుండా ఇరువైపులా నేరుగా ప్రయాణం సాగించవచ్చు.
స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) ప్యాకేజ్-4లో భాగంగా హైటెక్‌సిటీ ప్రాంతంలోని నాలుగు జంక్షన్లలో మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో బయోడైవర్శిటీ, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ విగ్రహం తదితర నాలుగు కూడళ్లను సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నాలుగు జంక్షన్లలో రూ. 379కోట్లతో ఏప్రిల్ 2016లో పనులు చేపట్టగా, ఇందులో రూ.108.59కోట్లతో మైండ్‌స్పేస్ జంక్షన్‌లో చేపట్టిన అండర్‌పాస్, ైఫ్లెఓవర్‌లతోపాటు గ్రౌండ్ లెవల్‌లో ఏర్పాటుచేసిన రోటరీ(సర్వీసు రోడ్లు) పనులు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ జంక్షన్‌లో ఆరులేన్ల అండర్‌పాస్ అందుబాటులోకి రాగా, తాజాగా ైఫ్లెఓవర్‌ను కూడా శుక్రవారం ప్రారంభించనున్నారు. దీనివల్ల ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యనుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. దీని నిర్మాణంతో ఈ జంక్షన్‌లో వాహనాన్ని నిలిపే అవసరం ఉండదని, పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారుంతుందని అధికారులు తెలిపారు.

మైండ్‌స్పేస్ జంక్షన్ అభివృద్ధితో ఉపయోగాలు
-మైండ్ స్పేస్ జంక్షన్‌లో ఇప్పటికే అండర్‌పాస్ నిర్మాణం కూడా అందుబాటులోకి తేవడంతో ైఫ్లెఓవర్‌ను ప్రారంభిస్తే ఈ జంక్షన్ పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారుతుంది.
-ఇనార్బిట్ మాల్ వైపు నుంచి రాడిషన్ వైపు వాహనాలు అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగించే వీలు కలుగుతుంది
-అండర్‌పాస్‌తో హైటెక్ సిటీ వైపు నుంచి బయోడైవర్శిటీ వైపు ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది
-ఆరులేన్ల గ్రేడ్ రోటరీతో హైటెక్ సిటీ వైపునుంచి రాడిషన్ వైపు, అలాగే బయోడైవర్శిటీ వైపు నుంచి ఇనార్బిట్ మాల్ వైపు ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది.
-ఈ జంక్షన్‌లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది

మైండ్‌స్పేస్ జంక్షన్ పనుల వివరాలు....
పని వ్యయం(కోట్లలో)
నాలుగు లేన్ల బై-డైరెక్షనల్ ైఫ్లెఓవర్ 48.06
ఆరు లేన్ల బై-డైరెక్షనల్ అండర్‌పాస్ 25.78
సర్వీసు రోడ్లు, యుటిలిటీ డక్ట్, డ్రైన్ 28.83
యుటిలిటీ షిఫ్టింగ్ 5.92
మొత్తం 108.59

నాలుగు లేన్ల ైఫ్లెఓవర్ విశేషాలు
పొడవు 830మీ.లు
వెడల్పు 16.60మీ.లు
క్యారేజ్ వే రెండులేన్ల బైడైరెక్షనల్ (ఇరువైపులా రెండేసి లేన్లు)
ఆరులేన్ల సర్వీసు రోడ్డు, డ్రైన్, యుటిలిటీ డక్ట్ విశేషాలు
పొడవు 2600మీ.లు
రోడ్డు వెడల్పు 10.50.మీ.లు
డ్రైన్, యుటిలిటీ వెడల్పు 3.00మీ.లు

ట్రాఫిక్ వివరాలు...
రద్దీ సమయాల్లో గంటకు(2015లో) 14393(పీసీయు)
2035నాటికి పెరిగే ట్రాఫిక్ అంచనా 31536(పీసీయు)

2012

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles