పేదరికానికి కులం లేదు..

Fri,November 9, 2018 12:53 AM

బేగంపేట నవంబర్ 8 : పేదరికానికి కులం అనేది లేదు, అగ్రవర్ణ కులమైన బ్రాహ్మణుల్లోనూ పేదలు ఉన్నారు.. వారి స్థితిగతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు.. కేసీఆర్ ఓ ధార్మికుడు.. అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం సంజీవయ్య పార్క్‌లోని వండర్‌ఫన్ పార్క్‌లో బ్రాహ్మణ అత్మీయ సమ్మేళనం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, ఎంపీ సముద్రాల వేణుగోపాల చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మెళనంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రముఖ స్వామీజి జగన్నాథ మఠాధిపతి, రామానుజవృతధార జీయర్ స్వామిజీ, గాయిత్రి తత్వానంద రుషీ, విఠల్ శర్మ సిద్దాంతి, ఎంపీ కేవీ లక్ష్మీకాంతారావు, తెలంగాణ రాష్ట్ర అధికారి ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాల చారి, దేవుల ప్రభాకర్, గ్రంథాలయాల చైర్మన్, ఆయాచితం శ్రీధర్, తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు గంగు ఉపేంద్ర శర్మ, గంగు భానుమూర్తిలతో పాటు పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు.

రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన దేవాలయాలైన యాదాద్రి, బాసర, వేములవాడ, ధర్మపురి, భద్రాచలం లాంటి దేవాలయాల అభివృద్ధి చేపట్టినట్టు తెలిపారు. యావత్తు భారతదేశం గర్వపడేలా ఆయుత చండీ యాగం చేసిన ప్రథమ వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందలకుపైగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ దేవాదాయ శాఖలో అర్చకులు, పురోహితులు, ఉద్యోగుల కష్టాలు గమనించిన కేసీఆర్ వారి డిమాండ్ తగ్గట్టుగా జీతా భత్యాలు ఐదు వేలు ఉంటే వారికి నలభై వేలు అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దేవాలయాల్లో దూపదీపా నైవేధ్యాలకు రూ.ఆరు వేలు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా బ్రాహ్మణుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని, కేవలం కేసీఆర్ బ్రాహ్మణులకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ నలభై ఏండ్లుగా ప్రభుత్వాల పనితీరును పరిశీలిస్తున్నా, ఏ ముఖ్యమంత్రి చేపట్టలేని పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles