వైభవంగా సదర్ ఉత్సవాలు

Fri,November 9, 2018 12:52 AM

ముషీరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : యాదవ్‌ల ప్రతిష్టాత్మక పండుగ సదర్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం(నేడు) జరుగనున్న సదరు వేడుకల్లో సందడి చేయడానికి భారీ శరీరాకృతి కలిగిన దున్నపోతులు హహన్‌షా, యువరాజు, ధారా లు నగరానికి వచ్చాయి. నగరంలోని ముషీరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో జరిగే సదర్ ఉత్సవాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఈ దున్నలు సందడి చేయనున్నాయి. అఖిల భారత యాదవ మహాసభ నేత, టీఆర్‌ఎస్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ కోట్లాది రూపాయల అత్యంత ఖరీదైన దున్నలను హర్యానా నుంచి సదర్ ఉత్సవాలకోసం తీసుకువచ్చారు. దున్నలు ముషీరాబాద్ ఫత్తర్‌బాగ్‌లో గత రెండు రోజులుగా సందడి చేస్తున్నాయి. వీటిని చూడటానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. బుధవారం రాత్రి ముషీరాబాద్‌లో జరిగిన సదర్ ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మహ్మద్‌అలీ పాల్గొన్నారు. సదరు ఉత్సవాల కోసం తీసుకువచ్చిన రెండు దున్నలు ఉన్నట్లు ఉండి పొట్లాటకు దిగడంతోపాటు ఒకదాని వెంట ఒకటి రోడ్డుపై పరుగులు తీయడంతో అక్కడున్న జనం బెంబేలెత్తిపోయారు. ఈ ఉత్సవాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జీ ముఠా గోపాల్, ఉత్సవాల నిర్వహకుడు, టీఆర్‌ఎస్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.

సీతారాంబాగ్‌లో..
అబిడ్స్ : సీతారాంబాగ్‌లో సదర్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంజయ్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌గౌడ్‌లు పాల్గొన్నారు. అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. కురుమ, యాదవులకు గొర్రెలను 75 శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమానికి పాటు పడే టీఆర్‌ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సంసిద్దులై ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్ గౌడ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో వంద సీట్లకు పైగా టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ నాయకులు మెట్టు ప్రసాద్, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్, జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ, నాయకులు ఏనుగుల వినోద్‌కుమార్, శ్రీశైలం యాదవ్, మెట్టు వెంకటేశ్, రవి గౌడ్, గబ్బర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

271
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles