మహిళా పోలీసులకు ఊరట


Fri,November 9, 2018 12:41 AM

ఆర్కేపురం : పిల్లల సంరక్షణను తల్లిదండ్రులు ఇద్దరు సమానంగా తీసుకోవాలని పద్మశ్రీ అవార్డుగ్రహీత శాంతాసిన్హా అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసుస్టేషన్‌లో పోలీసు కుటుంబాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన చైల్డ్‌కేర్ సెంటర్‌ను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసులు తమ పిల్లలను ఈ సెంటర్‌లో చేర్పించవచ్చని, దీంతో విధి నిర్వహణ చాలావరకు మెరుగుపడుతుందన్నారు. స్త్రీలకు సమానావకాశాలు కల్పించినప్పుడే వారు అన్నిరంగాల్లో ముందుకు సాగుతారని తెలిపారు. అన్ని పోలీసుస్టేషన్లలో చైల్డ్‌కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళా పోలీసు తనపాపను బల్లమీద పడుకోబెట్టి పనిచేస్తున్న విషయాన్ని పత్రికల్లో చూసి కలత చెందానని, అలాంటి పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటి చైల్డ్‌కేర్ సెంటర్‌ను సరూర్‌నగర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, మల్కాజిగిరి డీసీపీ శర్మ, షీటీమ్ అదనపు డీసీపీ సలీమ, ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీధర్‌రావు, ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, ఏసీపీ శిల్పవల్లి, సరూర్‌నగర్ మహిళా పోలీసుస్టేషన్ సీఐ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

186
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...