కార్తీకం..టూరిజం బస్సులు సిద్ధం


Fri,November 9, 2018 12:40 AM

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : పవిత్ర కార్తీకమాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లోని శైవక్షేత్రాలను సందర్శించేందుకు పర్యాటకశాఖ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించాలనే భక్తుల డిమాండ్‌కనుగుణంగా బస్సులు తిప్పుతున్నది. ఇందులోభాగంగా ఆరు ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేసింది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఒక ప్యాకేజీగా, రెండవ ప్యాకేజీగా కాళేశ్వరం,రామప్ప, వేయిస్తంభాలగుడి, యాదగిరిగుట్ట, కీసరగుట్ట, మూడోప్యాకేజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి,పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, నాలుగోప్యాకేజీలో అనంతగిరి, వికారాబాద్ వనభోజనాలు ప్యాకేజీ, ఐదోప్యాకేజీలో భాగంగా బీచుపల్లి, అలంపూర్, ఆరోప్యాకేజీలో తెలంగాణ పంచ శివక్షేత్రాలైన వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాలగుడి, పాలకుర్తి సోమనాథ ఆలయం.

ప్యాకేజీ ధర ఇలా..
1. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి(నాన్‌ఏసీ బస్సులు): పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.1040
2. కాళేశ్వరం,రామప్ప,వేయిస్తంభాలగుడి, యాదగిరిగుట్ట, కీసరగుట్ట: పెద్దలకు రూ.1650, పిల్లలకు రూ.1320
3. అమరావతి, పాలకొల్లు,భీమవరం, ద్రాక్షారామం,సామర్లకోట: పెద్దలకు రూ.3500, పిల్లలకు రూ.2,800
4. అనంతగిరి, వికారాబాద్ వనభోజనాలు ప్యాకేజీ: పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.720
5. బీచుపల్లి, అలంపూర్: పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.720
6. వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాలగుడి, పాలకుర్తి సోమనాథ ఆలయం : ఏసీ కోచ్‌లో పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000,నాన్‌ఏసీలో పెద్దలకు రూ.2200, పిల్లలకు రూ.1760 నిర్ణయించారు. ఇది రెండ్రోజులపాటు టూర్ ఉండనుంది.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...