మృత్యువు కబళించింది..


Fri,November 9, 2018 12:40 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: సదర్ సమ్మేళనం చూసి ఇంటికి వెళ్తున్న క్రమం లో వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకా రం... మోహన్‌నగర్ శృంగేరీ కాలనీకి చెందిన నితిన్, కొత్తపేటకు చెందిన వెంకటేశ్ స్నేహితులు. బుధవారం రాత్రి కొత్తపేటలో జరిగిన సదర్ సమ్మేళనాన్ని తిలకించేందుకు వెళ్లారు. అనంతరం తెల్లవారుజామున నడుచుకుంటూ శృంగేరీ కాలనీ వెళ్లేందుకు బయలు దేరారు. అదే సమయంలో అపాజీ బైక్‌పై కొత్తపేటకు చెందిన మహే శ్ వస్తూ స్నేహితులను గమనించి బైక్‌ను ఆపాడు. ముగ్గురు బైక్‌పై శృంగేరీ కాలనీకి వస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో మోహన్‌నగర్ వద్ద నాగోల్ నుంచి కొత్తపేటకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తూ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...