యాప్రాల్‌లో ఘర్షణ


Tue,October 23, 2018 01:49 AM

-తమ్ముడు మృతి, అన్నకు తీవ్రగాయాలు
జవహర్‌నగర్ : యాప్రాల్‌లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో తమ్ముడు మృతిచెందగా అన్న తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. యాప్రాల్ ఇందిరానగర్‌లో నివాసముంటున్న జై కుమార్, మీరాబాయికి ముగ్గురు కుమారులు. వీరిలో విక్రం, విక్కీలు(చెన్నారెడ్డి) ఆదివారం రాత్రి దుర్గామాత ఊరేగింపునకు వెళ్లారు. అనంతరం పెద్ద కుమారుడు విక్రం ఇంటికి రాగా..విక్కీ తన సోదరుడు వికాస్, స్నేహితులు జోసఫ్, కృష్ణలతో కలిసి జేజేనగర్‌లో నివసించే శ్రావణ్‌కుమార్(32) ఇంటికెళ్లి డోరు కొట్టారు. ఇంట్లో నిద్రిస్తున్న శ్రావణ్‌కుమార్ బయటకు రాగా..మా వదినకు ఎందుకు ఫోన్ చేస్తున్నావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విక్కీ శ్రావణ్‌కుమార్ తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. ఆవేశంలో ఉన్న శ్రావణ్ కత్తితో విక్కీపై దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. విక్కీ సోదరుడు వికాస్‌కు సైతం తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విక్కీ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వికాస్, విక్రమ్‌లను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడు తల్లి మీరాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...