పొత్తు కుదిరేనా!


Mon,October 22, 2018 12:20 AM

- టీజేఎస్ గొంతెమ్మ కోర్కెలు
- శివారు సీట్లపై టీడీపీ మొండిపట్టు
- నైరాశ్యంలో కాంగ్రెస్ ఆశావహులు
-జోరుగా టీఆర్‌ఎస్ ప్రచారం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ఎన్నికల షెడ్యూల్ విడుదలై పక్షం రోజులవుతున్నా.. కాంగ్రెస్ కూటమి పొత్తు పొడవనే లేదు.. టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తాలేక భావ వైరుధ్యం గల కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు పొత్తుకు సిద్ధమైనా.. సీట్ల సర్దుబాటు వారికి తలకు మించిన భారంగా మారింది. గ్రేటర్‌లోని సింహభాగం సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్, శివారు స్థానాలన్నీ తమకే కేటాయించాలని టీడీపీ, తమకూ వాటా ఇవ్వాలంటూ టీజేఎస్ పట్టుబడుతున్నాయి. పలు స్థానాల్లో ఆయా పార్టీల ఆశావహులు తమకే టికెట్ కావాలని మొండికేస్తుండటంతో.. పొత్తు వ్యవహారం అసలుకే ఎసరు తెచ్చేలా తయారైంది. కాగా అసెంబ్లీ రద్దయిన రోజే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాక్షేత్రంలో వారికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారి విజయావకాశాలు నల్లేరు మీద నడకలా మారుతున్నాయి. పాతబస్తీలో శనివారం నిర్వహించిన రాహుల్‌గాంధీ సభకు సరైన స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత డీలా పడ్డాయి.

టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు‚
మహేశ్వరం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఇతర పార్టీల యువత పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని, ఇక టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మహేశ్వరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సప్పిడి రాజు, మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పునుంతల శ్రీనివాస్, పార్టీ నాయకుడు బి. వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో తుక్కుగూడకు చెందిన కాంగ్రెస్, టీడీపీ యువకులు 50 మంది యువకులు తీగల కృష్ణారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో దొంతరమోని శ్రీకాంత్, పిట్టల ఆంజనేయులు, కళ్లెం భిక్షపతి, నార్లకంటి నర్సింగ్, నార్లకంటి శ్రీకాంత్, కుమ్మరి హన్మంత్, బొక్క శ్రీకాంత్, నార్లకంటి శేఖర్, గునిగంటి నర్సింహ, ఢిల్లి విజయ్, సప్పిడి రమేశ్, సప్పిడి తిరుమల్, సప్పిడి చిన్నరాజు, జి. భరత్, పాశం ప్రభాకర్‌గౌడ్, పల్క లక్ష్మయ్యలతో పాటు మరో 30 మంది యువకులు చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కూన యాదయ్య, మాజీ సర్పంచ్ కోర్పోలు రాకేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంఏ సమీర్, నార్లకంటి బాల్‌రాజ్, పాశం నందు, పోసాని నందు, లవకుమార్, సన్నిల్ అనిల్, పలువురు నాయకులు ఉన్నారు.

అభివృద్ధిని ఆదరించాలి
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆదరించాలని ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ అన్నారు. ఆదివారం కొత్తపేట డివిజన్‌లోని సమతాపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులను కలిసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, కొత్తపేట కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాగిరి ఉదయ్‌గౌడ్, కాలనీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఉపాధ్యక్షులు అంబిరెడ్డి, శ్రీనివాస్, శ్రీకర్‌రెడ్డి, సంగారెడ్డి, శేషగిరి, కాశిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాండుగౌడ్, నలబోలు సత్యనారాయణరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కూకట్‌పల్లిలో కారు జోరు

-టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని శేషాద్రినగర్
-కాలనీ వాసుల ప్రతిజ్ఞ
కూకట్‌పల్లి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని శేషాద్రినగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీ వాసులతో ఆదివారం స్థానిక కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ పార్టీకే తమ ఓటు వేస్తామని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి రావు, లక్ష్మణ్ రావు,శాంతకుమార్‌రెడ్డి, రమణ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు జనం నీరాజనం
ఎర్రగడ్డ, నమస్తే తెలంగాణ : రహ్మత్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ డివిజన్‌లోని ఓంనగర్, ఎన్‌ఎస్‌బీ నగర్ బస్తీల్లో పాదయాత్ర చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. స్థానికులు గోపీనాథ్‌కు సాదర స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.డివిజన్ అధ్యక్షుడు బషీర్, కార్యదర్శి అరుణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

257
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...