నిరంతర సాధనతోనే రాణింపు

Mon,October 22, 2018 12:10 AM

-డాక్టర్ గరికిపాటి నరసింహారావు
తెలుగుయూనివర్సిటీ : తెలుగు సాహిత్యానికి నిరంతరం సేవ చేస్తున్న సాధన నరసింహాచార్య కృషి ఎనలేనిదని మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రశంసించారు. సాధన సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగువర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం సాధన నరసింహాచార్య సాహిత్య సేవా స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గొడవర్తి సంధ్య రచించిన పోతన చరిత్ర మొదటి భాగం గ్రంథాన్ని మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతోనే ఏ పనిలోనైనా రాణించవచ్చన్నారు. పోతన చరిత్రను ప్రతి సాహితీవేత్త అధ్యయనం చేయాలని సూచించారు. వానమామలై వరదాచార్య పద్యాకృతికి వచనాకృతి సంధ్య గొప్పగా చేశారని అభినందించారు. ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అశ్విని చారిటబుల్ ట్రస్టు చైర్మన్ అశ్విని సుబ్బారావు, సాహితీవేత్తలు ఆచార్య తిరుమల, సి.హెచ్ హనుమంతరావు, డాక్టర్ రాపాక ఏకంబరాచార్యులు, సన్నిదానం నరసింహాశర్మ, డాక్టర్ వై. రామకృష్ణారావు, ఆచార్య రాణి సదా శివమూర్తి తదితరులు పాల్గొని డాక్టర్ పి.విజయబాబు, డాక్టర్ అనంతలక్ష్మి, ఎ సూర్యకుమారి తదితరులను ఘనంగా సత్కరించారు.

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles