ఉత్సాహంగా ఎస్‌బీఐ గ్రీన్ మారథాన్


Mon,October 22, 2018 12:08 AM

శేరిలింగంపల్లి: గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఎస్‌బీఐ రెండో ఎడిషన్ గ్రీన్ మారథాన్‌లో 5, 10, 21 కిలోమీటర్ల పరుగులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 4500 మంది ఎస్‌బీఐ ఉద్యోగులు, నగరవాసులు పాల్గొన్నారు. ప్రముఖ బాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలో గ్రీన్ మారథాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్‌బీఐ సీజీఎం స్వామినాథన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ రెండో ఎడిషన్ గ్రీన్ మారథాన్ నిర్వహిస్తుందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఈ సంవత్సరం హైదరాబాద్‌లో తమ గ్రీన్ మారథాన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో దేశవాప్తంగా ముంబై, బెంగళూర్, త్రివేండ్రం, గౌహతి, భూపాల్, చెన్నై, భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్ నగరాల్లో గ్రీన్ మారథాన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ డీఎండీ (ఇన్‌స్పెక్షన్ అండ్ ఆడిట్) బిడాల్ చంద్రదాస్‌తోపాటు పలువురు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

150
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...