అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం


Mon,October 22, 2018 12:07 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 414 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, తెలంగాణ నుంచి అమరులైన ఇద్దరినీ స్మరించుకున్నారు. సైబరాబాద్ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్, అక్టోపస్ కానిస్టేబుల్ లక్‌పతిల కుటుంబాలను ఈ సందర్భంగా సత్కరించారు. అమరుల త్యాగాలను స్మరించుకుని కొత్తగా పోలీసు విభాగంలో చేరే వారిలో నూతనోత్తేజాన్ని నింపడానికి ఈ సంస్మరణ సభలు దోహదపడుతాయని సీపీ సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమరులైన పోలీసుల ధైర్యసాహసాలు, వారి సేవలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు.
ఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో..
పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ సంజయ్ సంకీర్తాయ, మౌలాలి ఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఐజీ డైరెక్టర్ ఏఎన్ సిన్హా, ఆర్‌పీఎఫ్ అడిషనల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ జీఎం ఈశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. అమరులకు నివాళిగా ఆర్‌పీఎఫ్ బ్యాండ్ వాయించారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...