అగర్‌బత్తీ కంపెనీలో అగ్ని ప్రమాదం


Mon,October 22, 2018 12:06 AM

పహాడీషరీఫ్ : అగర్‌బత్తీల తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20లక్షల విలువైన సామగ్రి కాలిబూడిదైంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.... మోసిం అస్లాం, అస్లాం అజీంలు జల్‌పల్లి మున్సిపాలిటీ, బిస్మిల్లా కాలనీలో మైసూర్ అగర్‌బత్తీలను తయారు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆగర్‌బత్తీల తయారీ కేంద్రం నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు యజమానులకు , ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మోఘల్‌పుర, మలక్‌పేట, గౌలిగూడ, రాజేంద్రనగర్‌కు చెందిన 4 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆదివారం ఉదయం 10 గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చారు. బాలాపూర్ సీఐ సైదులు, ఎస్సై నాగరాజు, జిల్లా ఫైర్ ఆఫీసర్లు శ్రీధర్‌రెడ్డి, కె. విజయ్‌కుమార్, బి.వి. ప్రశాంత్, ప్రేంకుమార్‌లు, మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోయిన్‌బాబా, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ అప్రోజ్, సూపర్‌వైజర్లు కుమార్, హరినాథ్, అంజయ్య, కామేశ్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు రూ.20లక్షల నష్టం జరిగినట్లు సమాచారం. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే యజమానులు అనుమతులు తీసుకొని నడిపిస్తున్నామని తెలుపగా... జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ సాబేర్‌అలీ మాత్రం మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకోలేదని తెలుపడం గమనార్హం.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...