అభివృద్ధి పథంలో పాతబస్తీ


Sun,October 21, 2018 12:12 AM

సైదాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాతబస్తీ అభివృద్ధి చెందందని యాకుత్‌పురా నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుందర్‌రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలను కేటాయించి అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. యాకుత్‌పురా నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థ్ధి సామ సుందర్ రెడ్డి పాతబస్తీలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం గౌలిపురా డివిజన్ పరిధిలోని లాల్‌దర్వాజలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తనకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ప్రజల్ని కోరారు. గతంలో పాతబస్త్తీలో రెండు వర్గాల ప్రజల మధ్య పార్టీలు ఘర్షణలు పెట్టి ప్రజలకు నిద్రలేకుండా ఉండే పరిస్థితులను సృష్టించే వారని, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పాతబస్తీ అంతా ప్రశాంతంగా మారిందన్నారు. పాతబస్తీలో చిన్న ఘర్షణలు లేకుండా ప్రజలందరూ సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటు చెప్పిన ఘనత స్థానక ప్రజలందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చూసి, అభివృద్ధి వ్యతిరేకులకు తగిన గుణం చెప్పి, టీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శివకుమార్, మామిడోజు శంకరాచారి, ప్రవీణ్‌రాజ్, చంద్రశేఖర్, సాయిబాబా,శైలజాగౌడ్, శారద, రాధాకృష్ణ, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...