కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి


Sun,October 21, 2018 12:11 AM

మెహిదీపట్నం : సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని కార్వాన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఠాకూర్ జీవన్ సింగ్ అన్నారు. శనివారం లంగర్‌హౌస్ డివిజన్‌లో గాంధీనగర్, లోయర్ ప్రశాంత్‌నగర్ పరిసర బస్తీల ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షుడు ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చంద్ర కాంత్, నాయకులు వావిలాల మహేశ్వర్, గరిశె లక్ష్మణ్, శేఖర్ యాదవ్, సోమాచారి, సత్యనారాయణ, రవీంద్ర చారి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లంగర్‌హౌస్‌లో ప్రజలు జీవన్‌సింగ్‌కు ఘన స్వాగతం పలికి తమ మద్దతు టీఆర్‌ఎస్‌కే అని అన్నారు. ఈ సందర్భంగా జీవన్‌సింగ్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని జీవన్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చంద్ర కాంత్, కోయల్ కార్ శ్రీనివాస్, చందు, రవికాంత్, వినోద్, కృష్ణదాస్ పాల్గొన్నారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...